ఏపీలో పంచాయితీ ఎలక్షన్లు అటు అధికార, ఇటు విపక్ష హోదా పార్టీలయిన వైసీపీ, టీడీపిలకు ఎంతమేరకు ఊపునిచ్చాయన్నది పక్కనబెడితే.. జనసేన మాత్రం ఫుల్ జోష్ లో ఉందట.. దానికి కారణం ఎమ్మెల్యే రాపాకనేనట..
ఎమ్మెల్యే రాపాక.. గత అసెంబ్లీ ఎన్నికల్ల్లో జనసేన తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే.. పార్టీ అధినేత పవన్ సైతం పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినా.. రాపాక గెలుపొందారు. ఏపీ మొత్తం మీద జనసేన తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా కాలరు ఎగరేశారు.
కట్ చేస్తే.. ఏం లోపాయికారీ ఒప్పందలో కాని.. ఆనక తను పవన్ పేరు చెప్పుకుని గెలుపొందలేదని.. తన సొంత బలంతోనే నెగ్గాను అంటూ పలుసార్లు చెప్పుకొచ్చారు. అక్కడితో ఆయన ఆగిపోలేదు. పార్టీ అధినేత నిర్ణయాలను ధిక్కరిస్తూ జగన్ కు జై కొట్టారు.
ఒక అప్పటి నుంచి కండువా జనసేనది, పార్టీ మాత్రం వైసీపీది అన్నట్లుగా వ్యవహరించారు. ఇంకాస్త ముందుకెళ్లి అసలు రాజోలులో పవన్ కు ఇమేజ్ లేదు అన్నట్టు కామెంట్లు చేస్తూ వచ్చారు.
అది బాగా గుర్తు పెట్టుకున్నరేమో జనసేన క్యాడర్ ఇప్పడు గట్టిగానే బదులిచ్చారనిపిస్తోంది. రాపాకకు పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులు ఊహించని షాక్ ఇచ్చారు. తమ అధినేతకు వెన్నుపోటు పొడిచిన ఎమ్మల్యేలకు తగితన గుణపాఠం చెప్పాము అంటున్నారు జనసేన కార్యకర్తలు. ఎమ్మెల్యే వరప్రసాద్ వైసీపికి జై కొట్టినా రాజోలు ప్రజలు మాత్రం జనసేనకే జై కొట్టారు.
నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సొంత నియోజకవర్గం రాజోలులో జనసేన సర్పంచ్ అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. పంచాయతి ఎన్నికల్లో దాదాపు 20 కి పైగా స్థానాల్లో జన సేన కి చెందిన నేతలు విజయం సాధించారు. డమటి పాలెం, టెకిషెట్టి పాలెం, కేశవదాసు పాలెం, కాత్రెని పాడు, ఈటుకూరు, మెడిచర్ల పాలెం, బట్టే లంక, రామరాజు లంక, కత్తిమండ, కూనవరం, గోగునమ్మటం, తూర్పు పాలెం, సఖినేటిపల్లి లంక, అంతర్వేది, అంతర్వేది కర, మామిడికుదురు లతో పాటుగా పలు స్థానాల్లో జన సేన ఘన విజయం సాధించింది. అయితే రాపాక వరప్రసాదరావు కి జన సేన ఈ పంచాయతీ ఎన్నికల తో గట్టి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ మేరకు జన సేన అభిమానులు రాపాక పై గుర్రుగా ఉన్నారు. పవన్ కి రాపాక వెన్నుపోటు పట్ల జన సైనికులు సరైన రీతిలో రివెంజ్ తీర్చుకున్నారు అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారాయి.