విశాఖలో మంత్రుల కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో మంత్రి రోజా డ్రైవర్ గాయపడటం ఉద్రిక్తతలకు దారి తీసింది. విశాఖ గర్జన కార్యక్రమం అనంతరం మంత్రులు తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటున్న సమయంలో కర్రలతో కాన్వాయ్ పై దాడులకు దిగారు. జనసేన జెండాలు పట్టుకుని కొందరు మంత్రి రోజా, జోగి రమేష్, టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి వాహనాలపై కొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ ఘటనకు పాల్పడింది తమ పార్టీ కార్యకర్తలు కాదంటూ జనసేన మీడియాకు లేఖ విడుదల చేసింది. తమ నేతలపై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది.