More

  జమ్మూకశ్మీర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణం

  మంచి రోజులు అంటే ఎలా ఉంటాయి? మంచికి చేడుకు తేడాను ఎలా తెలుసుకోగలుగుతామంటే…, ఆ రెండింటికి మధ్య తేడాను తెలుసు కోవాలనుకునేవారి గుణగణాలు, వారి ఆలోచనలు, అలాగే వారి దృక్కోణమును బట్టి..,  మంచైతే మంచి., చేడు అయితే చెడునే వారు తెలుసుకోగలుగుతారు.! మహాభారతంలో ధర్మరాజుకు మనుషులు అందరూ మంచివారిగానే కనిపించారు. అదే సమయంలో దుర్యోధనుడికి మాత్రం అందరూ చెడ్డవారుగానే కనిపించారనే కథ మనకు తెలిసిందే.!  ఏదిమంచి ? ఏదీ చేడుల గురించి ఈ సంవాదం ఏమిటని మీరు అనుకుంటున్నారా? 

  అయితే వినండి..! కశ్మీర్ టు కన్యాకుమారి వరకు,  అటక్ నుంచి కటక్ వరకు ఇండియా వన్ నేషన్ అని మనం అంటాం..! మనం తెలుగు,తమిళ పౌరులం కాదు మనం భారతీయులం. మన నేషనలిటీ ఒక్కటే..! అందరం ఇండియన్స్..! భారత రాజ్యాంగం కూడా ఇదే చెప్పింది. మనలో ప్రాంతీయవాదలు, వేర్పాటువాదాలు, భాషా భేదాలు ఉండరాదు. అయితే తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సంతుష్టీకరణ రాజకీయాల కారణంగా.. జమ్మూకశ్మీర్ రాష్ట్రం భారత్ లో అంతర్భాగమైనా కూడా…,  వేర్పాటువాద విష బీజాలను మాత్రం కాంగ్రెస్ తోపాటు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీల నాయకులు అలాగే కొనసాగిస్తూ వచ్చారు. జమ్మూ ప్రాంత ప్రజలను అనేక వివక్షలకు గురిచేశారు.     

  మన దేశంలో జమ్మూకశ్మీర్ విషయం వచ్చేసరికి ఏదీ మంచి, ఏదీ చెడు అనే దృక్కోణం పూర్తిగా మారిపోయేది. 2019 ఆగస్టు 5వ తేదీ వరకు కూడా కశ్మీర్ లోయకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ , ఇంకా వేర్పాటువాద ఆల్ పార్టీ హురియత్ నాయకులు అంతా కూడా,  జమ్ముకశ్మీర్ అనగానే అదో సఫరేట్ దేశమైనట్లుగా భావించేవారు. భారత పాలకులను ఏ ఇండియా వాలే అంటూ సంబోధించేవారు. ఎప్పడైతే మోదీ సర్కార్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి.., ఆర్టికల్ 370 తోపాటు, 35 ఏను రద్దు చేసిందో,  ఇక అప్పటి నుంచి ఈ వేర్పాటువాదుల ఖేల్ ఖతం..! దుకాణ్ బంద్ అయ్యింది.  

  ఆర్టికల్ 370 రద్దుతో…జమ్మూకశ్మీర్ స్టేట్ లో భారత రాష్ట్రపతి తోపాటు సామాన్య భారత పౌరులు సైతం భూమి కొనుక్కొనే వెసులుబాటు కలిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు.., తాము తిరిగి అధికారంలోకి వస్తే మళ్లీ ఆర్టికల్ 370ని పునరుద్దరిస్తామని చెబుతున్నారంటే వారు దేశానికి మంచి కోరుతున్నారా? చెడు కోరుతున్నారా? అనేది ప్రజలే నిర్ణయించాలి.

  ఇక అసలు విషయానికి వస్తే.. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో , జమ్మూకశ్మీర్ లో నివసించే మన తిరుమల వెంకన్న భక్తుల కోరిక కూడా త్వరలోనే నెరవేరబోతోంది. అది ఏంటో తెలుసా? జమ్మూకశ్మీర్ లో శ్రీవారి భవ్యమైన ఆలయ నిర్మాణం!

  జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా  నేతృత్వంలోని అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్… జమ్మూలో శ్రీఆలయ నిర్మాణానికి భూమిని కేటాయిస్తూ అంగీకారం తెలిపింది. జమ్మూ సమీపంలో 496 కనాల భూమి.., దాదాపు 62 ఎకరాల భూమిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు 40 ఏళ్ళపాటు లీజుకు ఇచ్చింది. దీనికి సంబంధించిన అన్నిరకాల పేపర్ వర్క్ పూర్తి అయిన తర్వాత టీటీడీ ఆలయ నిర్మాణం చేపట్టనుందని తెలుస్తోంది.

  నిజానికి ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత… జమ్మూకశ్మీర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు వచ్చింది. అందుకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కూడా సూత్రపాయంగా అంగీకరించింది. అన్ని అనుకున్నట్లగా జరిగితే రెండేళ్లలోపే శ్రీవారి ఆలయం నిర్మించేలా టీటీడీ ప్రణాళికలు రచించింది. తిరుమల శ్రీవారి కొవెల నమునాలోనే జమ్మూలో నిర్మించబోయే ఆలయం ఉండనుంది. అలాగే ఒక వేద పాఠశాల,  ఒక వైద్యశాల, కల్యాణ మండపం, భక్తుల బస కోసం కాటేజీల నిర్మాణం కూడా చేపట్టనుంది. టీటీడీ, జమ్మూకశ్మీర్ ప్రభుత్వ నిర్ణయంతో…, మొత్తానికి తిరుమలను దర్శించే ఉత్తర భారత రాష్ట్రాల భక్తుల చిరకాల కోరిక త్వరలోనే నెరబోరనుంది.

  మరోవైపు టీటీడీ చెన్నైతోపాటు విశాఖపట్నం, భువనేశ్వర్ లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మిస్తోంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో, హర్యానాలోని కురుక్షేత్ర లో, తమిళనాడులోని కన్యాకుమారిలో టీటీడీ ఇప్పటికే శ్రీవారి ఆలయాలను నిర్మించింది.   

  Related Stories