More

    18 కిలోమీటర్లు నడిచి జమ్మూ కాశ్మీర్ గ్రామంలో వ్యాక్సిన్లు వేసిన వైద్య సిబ్బంది

    భారతదేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. భారతదేశంలోనే 100 శాతం కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్న గ్రామంగా జమ్మూ కాశ్మీర్ లోని ఓ మారుమూల గ్రామం నిలిచింది. జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలోని ఒక గ్రామంలో కోవిడ్ -19 అర్హులందరికీ టీకాలు వేశారు. ఈ రికార్డు అందుకున్న దేశంలోనే మొదటి గ్రామంగా మారింది. జమ్మూ కాశ్మీర్ లోని ‘వీయన్’ గ్రామంలో వయోజన జనాభాకు 100 శాతం టీకాలు వేసిన మొదటి గ్రామంగా అవతరించింది. జమ్మూ కాశ్మీర్ మోడల్ పరిధిలోని ఈ గ్రామంలో అర్హత ఉన్నవారికి వేగంగా టీకాలు వేయడానికి 10 పాయింట్ల ఎజెండాను అధికారులు రూపొందించారు. అందులో భాగంగానే వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తీ అయ్యింది. “బండిపోరా జిల్లాలోని వీయన్ అనే గ్రామంలో 18 ఏళ్లు పైబడిన జనాభా మొత్తానికి టీకాలు వేశారు” అని PIB జమ్మూ కాశ్మీర్ యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతా ట్వీట్‌లో తెలిపారు.

    జమ్మూ కాశ్మీర్ లో 45 కంటే ఎక్కువ వయసు ఉన్న వారిలో 70 శాతం మంది టీకాలు వేయించుకున్నారు. ఇది జాతీయ సగటు కంటే రెట్టింపు అని జమ్మూ కాశ్మీర్ అధికారులు తెలిపారు. బండిపోరా జిల్లా ప్రధాన కార్యాలయానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి ఆరోగ్య అధికారులు చేరుకోవడానికి 18 కిలోమీటర్ల దూరం నడవవలసి ఉంటుంది. ఈ గ్రామానికి సరైన రహదారి లేదని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. ఇక గ్రామంలో ఇంటర్నెట్ సదుపాయం లేదని బండిపోరా చీఫ్ మెడికల్ ఆఫీసర్ బషీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. పట్టణ ప్రాంతాల ప్రజలు టీకాల కోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకునేలా.. నియామకాలు పొందడం నివాసితులకు సాధ్యం కాదని అన్నారు. గ్రామంలో మొత్తం 362 మంది లబ్ధిదారులు టీకాను అందుకున్నారు. దేశంలోనే పూర్తిగా టీకాలు వేసిన మొదటి గ్రామంగా నిలిచింది.

    Trending Stories

    Related Stories