More

    బిపిన్ రావత్ మరణంపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్

    తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది మృతి చెందారు. ఆయన మరణంపై దేశ ప్రజలు చింతిస్తూ ఉండగా.. కొందరు మతోన్మాదులు మాత్రం అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అలాంటి వారిపై పోలీసు యంత్రాంగం కన్నెర్ర జేసింది. జనరల్ బిపిన్ రావత్ మరణంపై సోషల్ మీడియాలో అత్యంత అభ్యంతరకరమైన పోస్టులు చేసినందుకు జమ్మూ కశ్మీర్ పోలీసులు రాజౌరికి చెందిన దుకాణదారుని అరెస్టు చేశారు

    చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌ పై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేసినందుకు రాజౌరి సమీపంలోని ఒక గ్రామానికి చెందిన దుకాణదారుని జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అతని గుర్తింపును వెల్లడించలేదు. అయితే అతనిపై రాజౌరి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిందని, నిందితులపై తదుపరి విచారణ చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. దుకాణదారుడు సోషల్ మీడియాలో పోస్ట్ సున్నితమైనది మాత్రమే కాకుండా అత్యంత అభ్యంతరకరమైనదని పోలీసులు తెలిపారు. రాజౌరి పోలీస్ స్టేషన్ పోలీసులు నిందితుడి గురించి, ఆ వ్యక్తిపై ఎలాంటి ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్న వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. బిపిన్ రావత్ మరణాన్ని కొందరు ఇస్లాంవాదులు, దేశ వ్యతిరేకులు సంబరాలు చేసుకున్న అనేక ఉదాహరణలలో ఇది ఒకటి. ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన పోస్ట్‌ను గమనించిన వెంటనే, నిందితుడిని విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు తరలించి, ఆపై అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    అంతకుముందు, రావత్ మరణాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన టోంక్‌కు చెందిన 21 ఏళ్ల జవాద్ ఖాన్‌ను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రమాదానికి గురయ్యారన్న వార్త క్షణాల్లో దేశం మొత్తం పాకిపోయింది. ఆయన ఎలాగైనా బతికి రావాలని దేశ ప్రజలు దేవుళ్లను ప్రార్థించారు. కానీ ఆయన తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు. బిపిన్ రావత్ మరణవార్తతో దేశం మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది. కానీ, ఇదే సమయంలో కొందరు దుర్మార్గులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉగ్రవాద భావజాలాన్ని చాటుకున్నారు. విదేశీ శత్రుమూకలతో జీవితాంతం పోరాడిన వ్యక్తి మరణాన్ని.. ఈ దేశంలో పుట్టినవాళ్లే సెలబ్రేట్ చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ మానసిక దివాళాకోరుతనాన్ని, మానవత్వ లేమి ప్రదర్శించారు.

    Trending Stories

    Related Stories