కొడుకు పెళ్లి కంటే.. మోదీ మీటింగ్ ముఖ్యమని వచ్చేసిన జమ్మూ కాశ్మీర్ గవర్నర్

0
693

కుమారుడి పెళ్లి అంటే ఏ తండ్రికైనా ఎంతో ప్రత్యేకమైన రోజు..! కానీ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాత్రం కుమారుడి పెళ్లి కంటే.. జమ్మూ కాశ్మీర్ భవితవ్యం గురించే ఎక్కువగా ఆలోచించారు. కీలకమైన అఖిలపక్ష సమావేశానికి హాజరుకావడానికి మనోజ్ సిన్హా తన కొడుకు వివాహాన్ని హాజరవ్వలేదని తెలియడంతో పెద్ద ఎత్తున అభినందనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రజా సేవ పట్ల ఆయనకున్న అత్యుత్తమ నిబద్ధతకు ఈ ఘటనే ఒక ఉదాహరణ అని నెటిజన్లు ప్రశంసిస్తూ ఉన్నారు. మనోజ్ సిన్హాను అభినందించడానికి సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తారు. జమ్మూ కాశ్మీర్ భవిష్యత్తు గురించి చర్చించడానికి ప్రధానితో అఖిలపక్ష భేటీ జరగ్గా.. ఆ కార్యక్రమానికి మనోజ్ సిన్హా హాజరయ్యారు.

తన కుమారుడి వివాహం జరిగిన రోజునే న్యూ ఢిల్లీ లో ప్రధాని మోదీ ఇంట్లో కాశ్మీర్ గురించి జరిగిన అఖిలపక్ష సమావేశంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హాజరైనట్లు సోషల్ మీడియా యూజర్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభించబోయే అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ లోని వివిధ పార్టీలతోనూ, నేతలతోనూ సమావేశం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ రాజకీయ నాయకులతో జరిగిన 3 గంటల సమావేశంలో మోదీ ఇంకా పలువురు నాయకులు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ గురించి మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్ సిన్హా, జాతీయ రాజధానిలోని మోదీ అధికారిక నివాసంలో గురువారం నాడు జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు.

కీలకమైన సమావేశానికి హాజరు కావడానికి మనోజ్ సిన్హా తన కొడుకు వివాహం నుండి నేరుగా వచ్చాడని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రధాని మోదీతో సమావేశం పూర్తయిన తర్వాతే మనోజ్ సిన్హా ప్రధానమంత్రి నివాసం నుంచి వివాహ వేదిక వద్దకు చేరుకున్నారని చెబుతున్నారు. బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ పెళ్ళికి సంబంధించిన చిత్రాలను తరువాత రోజు పోస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ సమస్యలపై చర్చించడానికి మనోజ్ సిన్హా తన కుమారుడి వివాహంలో కూడా ఉండకుండా మోదీ ఇంట్లో మీటింగ్ కు హాజరు అవ్వడంతో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతను నెటిజన్లు ప్రశంసించారు. తన వ్యక్తిగత జీవితంలో చాలా ముఖ్యమైన రోజులలో కూడా తన కుటుంబానికి దూరంగా ఉన్నందుకు మనోజ్ సిన్హాపై పొగడ్తల వర్షం కురిపించారు. మోదీ ప్రభుత్వంలో గతంలో రైల్వే మంత్రిగా ఉన్న మనోజ్ సిన్హాను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ 2020 ఆగస్టు 6 న నియమించారు.

జమ్మూ కశ్మీర్‌‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో.. కశ్మీర్‌లో క్షేత్రస్థాయి నుంచి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ త్వరగా పూర్తయితే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందని తెలిపారు. తద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుందని అన్నారు. ఈ అఖిలపక్ష సమావేశానికి పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌, బీజేపీ సహా ఎనిమిది పార్టీలకు చెందిన 14 మంది నేతలు హాజరయ్యారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి రాజకీయ పార్టీల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన తొలి భేటీ ఇదే. దాదాపు మూడున్నర గంటల పాటు సమావేశం సుహృద్భావ వాతావరణంలో కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న నేతల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దాదాపు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ భేటీని ‘జమ్మూ-కశ్మీర్‌ సమగ్ర అభివృద్ధికి సంప్రదింపుల ప్రక్రియ కీలకమైన ముందడుగు’గా మోదీ అభివర్ణించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here