జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లోని రఖామా ప్రాంతంలో శుక్రవారం ఉదయం భద్రతా దళాలు మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. “ఒక గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ జరుగుతోంది. పోలీసులు మరియు భద్రతా దళాలు ఉగ్రవాదుల ఏరివేతలో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియజేస్తాము” అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.
రఖామా ప్రాంతంలో భద్రతా బలగాలను చూసి ఉగ్రవాదులు తొలుత కాల్పులు ప్రారంభించగా, వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. దర్యాప్తు అనంతరం ఉగ్రవాది వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఘటన చోటు చేసుకున్న కొన్ని గంటల తర్వాత, పోలీసులు మరియు భద్రతా దళాలు ఆపరేషన్ చేస్తున్న అదే ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.