ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్ లో ఓ పోలీస్ అధికారి ఇంటి దగ్గర అతడిని కాల్చి చంపారు. పుల్వామా జిల్లా పాంపోర్ ప్రాంతంలోని సంబూరాలో ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ ఫరూఖ్ అహ్మద్ మీర్ ఇంటిపై శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ సమయంలో ఎస్పై పై కాల్పులు జరిపారు. ముష్కరుల దాడిలో ఫరూక్ అక్కడిక్కడే చనిపోయారు. ఫరూక్ ప్రస్తుతం లేత్‌పొరాలో సిటీసీలోని ఐఆర్‌పీ 23వ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. ఫరూర్ కు తండ్రి, భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మీర్‌ను CTC లెత్‌పోరాలోని IRP 23వ బెటాలియన్‌లో నియమించినట్లు అధికారులు తెలిపారు. కశ్మీర్ జోన్ పోలీసుల కథనం ప్రకారం ఫరూఖ్ నిన్న సాయంత్రం తన వరి పొలంలో పని కోసం తన ఇంటి నుండి బయలుదేరాడని, అక్కడ ఉగ్రవాదులు పిస్టల్ ఉపయోగించి కాల్చి చంపారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. “ఐఆర్‌పి 23 బిఎన్‌లో పోస్ట్ చేయబడిన సంబూర సి(ఎం)కి చెందిన ఫరూక్ మీర్ మృతదేహం అతని ఇంటికి సమీపంలోని వరి పొలాల్లో కనుగొనబడింది. ఉగ్రవాదులు పిస్టల్‌తో కాల్చి చంపారు’’ అని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.