More

  బందిపొరాలో ఇద్దరు తీవ్రవాదుల హతం

  జమ్ముకశ్మీర్‌లోని బందిపొరాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని టెర్రరిస్టులను భారత బలగాలు మట్టుబెట్టారు. బందిపొరాలోని శోక్‌బాబా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఆ సమయంలో గాలింపు బృందాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని చెప్పారు. చనిపోయిన తీవ్రవాదులు ఏ సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదు.

  ఈ వారంలో కాశ్మీర్ లోయలో పలు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. శుక్రవారం బారాముల్లాలోని సోపోర్‌లోని వార్పోరా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు హతమయ్యారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సోమవారం నాడు లష్కరే తోయిబా ఉగ్రవాది, మరో గెరిల్లా మృతి చెందారు.

  spot_img

  Trending Stories

  Related Stories