శ్రీనగర్‌లోని జామియా మసీదులో జరుగుతోంది ఇదే.. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు

0
715

అతిపెద్ద మసీదులలో ఒకటైన శ్రీ నగర్‌లోని జామియా మసీదులో శుక్రవారం నాడు ఆజాదీ, భారతదేశ వ్యతిరేక నినాదాలతో మారుమోగింది. శుక్రవారం ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం ఆజాదీ నినాదాలు చేశారు. మే 2019లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం చేతిలో హతమైన ఉగ్రవాద సంస్థ అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ చీఫ్ జకీర్ మూసాను అభినందించారు. ఇండియా టుడే గ్రూప్‌కు చెందిన జర్నలిస్ట్ అష్రఫ్ వానీ, జామియా మసీదు నుండి ఒక వీడియో క్లిప్‌ను పంచుకున్నారు, దీనిలో భారతదేశం నుండి విడిపోవాలంటూ చేస్తున్న నినాదాలు మనం వినవచ్చు.

వీడియో క్లిప్‌లో ఆజాదీ నినాదాలతో పాటు.. “నారా ఇ తక్బీర్, అల్లాహు అక్బర్” అనే నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. ఆజాదీ నినాదాలతో పాటు.. లోయలో శాంతి మరియు ప్రశాంతతకు భంగం కలగకుండా ఉండేలా భద్రతా చర్యల్లో భాగంగా ఉన్న జమ్మూ కశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందిపై మసీదు వెలుపల రాళ్ల దాడి కూడా జరిగింది.

శుక్రవారం నాడు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వబడ్డాయి. ఆగష్టు-2019 లో జమ్మూ కశ్మీర్ నుండి ఆర్టికల్ 370 రద్దు చేయబడిన తరువాత చోటు చేసుకున్న సంఘటన ఇది. రాళ్ల దాడి ప్రారంభమైన కొద్దిసేపటికే, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్పందించి గుంపును చెదరగొట్టారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత రాళ్ల దాడి ఘటనలు తగ్గుముఖం పట్టాయని గత నెల ప్రారంభంలో సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ తెలిపారు. “ఆర్టికల్ 370 రద్దు తర్వాత, రాళ్లదాడి సంఘటనలు దాదాపు శూన్యం,” అని 16 మార్చి 2022 న, CRPF 83వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా వ్యాఖ్యలు చేశారు.