More

    దుమ్ము రేపుతున్న ‘జై బాలయ్య’ సాంగ్..!

    నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ ‘జై బాలయ్య’ పాటను విడుదల చేశారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, కరీముల్లా పాడారు. ‘రాజసం నీ ఇంటి పేరు… పౌరుషం నీ ఒంటి పేరు’ అంటూ మొదలైన ఈ పాటను బాలయ్య అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ‘జై బాలయ్య’ అనే పదం తెలుగు యువతకు ఒక ఎమోషన్ లా మారింది. ఇప్పుడు ఆ నినాదంతో వచ్చిన పాట కావడంతో మాంచి క్యాచీగా అనిపించి అందరూ హమ్ చేసేస్తూ ఉన్నారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో, మీసం మెలేసి, మెడలో బంగారు చైన్లు, చేతికి వాచ్ తో బాలయ్య లుక్ కూడా చాలా బాగుంది. అనంతపురం జిల్లాలోనూ, యాగంటి క్షేత్రంలోనూ ఈ సాంగ్ షూటింగ్ జరిగింది. భారీ స్థాయిలో పాటను చిత్రీకరించారు. లిరికల్ సాంగ్ వీడియోలో సంగీత దర్శకుడు థమన్ చేసిన సందడి కూడా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంది. వైట్ అండ్ వైట్ లో థమన్ కూడా బాగా స్టెప్స్ వేశారు.

    భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. బాలయ్య సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది, కన్నడ నటుడు దునియా విజయ్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్, కేజీఎఫ్ అవినాశ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. 2023 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ కు సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉంది.

    Trending Stories

    Related Stories