More

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై ఫైర్ అయిన జగ్గారెడ్డి

    తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్, ఏపీ సీఎం జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది తెలంగాణలో భూకబ్జాలకు పాల్పడ్డారని.. మాదాపూర్ తో పాటు, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వీరు కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డికి తెలిసి చేశారో, తెలియకుండా చేశారో కానీ, ఈ కబ్జాలలో షర్మిల, బ్రదర్ అనిల్, జగన్ తదితరులు ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికీ ఉన్న ఆ కబ్జాలపై ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. తాను ఓపెన్ డిబేట్ కు సిద్ధమేనని స్పష్టం చేశారు. అందరి చరిత్రను బయటపెడతానని అన్నారు. అందరూ అవినీతిపరులు, ఆమె ఒక్కటే నీతిపరురాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారని షర్మిలపై విమర్శలు చేశారు. షర్మిలకు సరైన చరిత్ర లేదని, ఆమె ఇతర నాయకుల చరిత్రల గురించి మాట్లాడడం ఏంటని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

    శుక్రవారం నాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి మధ్య అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తమ మధ్య జరిగేది పట్టించుకోవాల్సిన అవసరంలేదని, తమది తోడికోడళ్ల పంచాయితీ అని చమత్కరించారు. ఒక ఇంట్లో ఉండే తోడికోడళ్లు ఎన్నో అనుకుంటారు, ఆ తర్వాత కలిసిపోతారు… తాము కూడా అంతేనని రేవంత్ రెడ్డి అన్నారు. జగ్గారెడ్డి కూడా మాట్లాడుతూ తాను రేవంత్ గురించి చెప్పాలనుకున్నది చెప్పేశానని.. ముందొక మాట వెనుక ఒక మాట మాట్లాడే అలవాటు తనకు లేదని, అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక రేవంత్ రెడ్డి గురించి మాట్లాడబోనని చెప్పారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు తన మద్దతు ఉంటుందని అన్నారు.

    Trending Stories

    Related Stories