National

ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన జగదీప్ ధన్ కడ్

భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనచే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన ధన్ కడ్.. మార్గరెట్ ఆల్వాను ఓడించారు. ధన్ కడ్ కు 74.36 శాతం ఓట్లు వచ్చాయి. నిన్నటితో వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియగా.. జగదీప్ ధన్ కడ్ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.

Related Articles

Back to top button