పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. రాజ్యసభ, లోక్‌సభలు ఉదయం 11గంటలకు సమావేశం అయ్యాయి. రాజ్యసభ ఛైర్మన్‌గా జగదీప్ ధన్‌ఖడ్ బాధ్యతలు స్వీకరించారు. సమావేశాల్లో మొదటిసారి ఆయన ఛైర్లో కూర్చుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడారు.
హౌజ్, దేశ ప్రజల తరపున ఛైర్మన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిని మీరు ఈ స్థాయికి చేరుకున్నారని అన్నారు. ధన్‌ఖడ్ దేశంలో ఎంతోమందికి స్ఫూర్తి అని కొనియాడారు. భారత్ అమృత్ కాల్ ప్రయాణం, జీ 20 దేశాల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని ప్రధాని గుర్తు చేశారు. అనంతరం ఇటీవల ప్రాణాలు కోల్పోయిన నేతలకు నివాళుర్పించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 దాకా కొనసాగనున్నాయి. 17 రోజుల పాటు సభ సమావేశం కానుండగా.. కేంద్ర ప్రభుత్వం 16 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది.