More

  అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన

  శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఇనగలూరులో అపాచీ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మొదటి దశలో రూ.350 కోట్లు, వచ్చే ఐదేళ్లలో మరో 350 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. అపాచీ పరిశ్రమలో అడిడాస్‌ షూలు, లెదర్‌ జాకెట్స్‌, బెల్ట్‌లు వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు లభిస్తాయన్నారు. 2023 సెప్టెంబర్‌ కల్లా పరిశ్రమ అందుబాటులోకి వస్తుందన్నారు.

  రానున్న రెండేళ్లలో ఉత్పత్తికి ఇనగలూరు అపాచీ యూనిట్ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా(అపాచీ గ్రూప్)కి భూ కేటాయింపుల పత్రాన్ని ఆ సంస్థ సీఈవో టోనీకి ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం అందించారు. ఎకరాకి రూ. 6,50,000 చొప్పున 298 ఎకరాల అన్ డెవలప్డ్ ల్యాండ్ కి సంబంధించి ల్యాండ్ అలాట్ మెంట్ లెటర్ అందజేశారు. స్థానికులకే 80 శాతం ఉద్యోగాలతో ఈ యూనిట్ ద్వారా 10వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

  spot_img

  Trending Stories

  Related Stories