International

కమ్యూనిస్టు పార్టీలో చేరాలని ఉందన్న జాకీ చాన్.. తీవ్ర విమర్శలు

ప్రముఖ సినీ నటుడు, మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ జాకీ చాన్‌ పాలిటిక్స్ విషయంలో ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా(సీపీసీ)లో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చైనా సినీ ప్రముఖుల మధ్య జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో జాకీ చాన్‌ తన మనసులోని మాట బయటపెట్టారని ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. సీపీసీ శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. జాకీ చాన్‌ మాట్లాడుతూ సీపీసీ విధానాలను ప్రశంసించారు. జాకీ చాన్ నేను ఆ పార్టీ సభ్యుణ్ని కావాలనుకుంటున్నానని వెల్లడించారు. చైనా ఫిలిం అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడైన జాకీ చాన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. హాంకాంగ్‌లో నివసిస్తున్న 67 ఏళ్ల జాకీ చాన్‌ ముందు నుంచీ సీపీసీకి మద్దతు పలుకుతున్నారు. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యవాదుల నిరసనను అణచివేయడానికి సీపీసీ చేపట్టిన చర్యలనూ ఆయన సమర్థించారు. అయితే జాకీ చాన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం మొదలైంది. ఆయన వ్యాఖ్యలను చాలా మంది స్వాగతించలేదు.

జాకీ చాన్ వ్యాఖ్యలను సీపీసీ లైట్ గా తీసుకుంది. సీపీసీ లో చేరాలని జాకీ చాన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు ఎగతాళి కూడా చేశారు. జాకీ చాన్ సీపీసీ సభ్యత్వానికి అనర్హుడని పలువురు నిపుణులు చెప్పారు.”అతని దేశభక్తి మరియు వృత్తి నైపుణ్యం గురించి నాకు ఎటువంటి సందేహం లేదు, కానీ అతని జీవనశైలిపై మా పార్టీ సభ్యులు సానుకూల ఉదాహరణను చూపాలి” అని ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.”జాకీ చాన్ వ్యాఖ్యలు కూడా తీవ్రంగా లేవని.. ఆయన ఒక్కో సందర్భంలో వేర్వేరు విధాలుగా వ్యవహరిస్తున్నాడు” అంటూ కామెంట్లు చేశారు.

చాన్ వివాదాస్పద వ్యక్తిగత జీవితం గురించి కూడా పలువురు వీబో సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. అతనికి గతంలో వివాహేతర సంబంధం ఉండడం, జాకీ కుమారుడు జేసీ చాన్ మాదకద్రవ్యాల నేరం.. అతడికి ఆరు నెలల జైలు శిక్ష విధించడంపై విమర్శలు ఎక్కువగా ఉన్నాయి.

కమ్యూనిస్ట్ పార్టీకి జాకీ చాన్ మద్దతు ఇచ్చినందుకు ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కొందరు చాన్ సినిమాను బహిష్కరించమని కోరారు, మరికొందరు తమ అభిమాన తార ప్రవర్తన పట్ల నిరాశ చెందుతున్నామని బాధను వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 + five =

Back to top button