బాలీవుడ్ లవ్‌లీ కపుల్ ఆలియా, రణబీర్ తల్లిదండ్రులయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఆలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈరోజు ఉదయం రణబీర్‌తో కలిసి ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రిలో చేరిన ఆమె కాసేపటి క్రితమే చిన్నారికి జన్మనిచ్చినట్లు రణబీర్ ఫ్యామిలీ తెలిపింది. అంతే కాకుండా తల్లి, కూతురు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఆలియా వెంట ఆసుపత్రిలో భర్త హీరో రణబీర్ కపూర్‌తో పాటు, నీతూ కపూర్, సోని రజ్దాన్, షాహిన్ భట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆలియా భట్ తన సోషల్ మీడియా ఖాతాలో ‘”And in the best news of our lives:- Our baby is here…and what a magical girl she is. We are officially bursting with love – blessed and obsessed Parents!!! love love love Alia and Ranbir.” అంటూ పోస్టు పెట్టింది. రణబీర్ కపూర్ తో కొంతకాలం డేటింగ్ లో ఉన్న ఆలియా.. ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు.