National

లడఖ్ లో 18000 అడుగుల ఎత్తులో సూర్య నమస్కారాలు.. గాల్వన్ లోయలోనూ యోగా

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా mYoga appను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ మొబైల్ యోగా యాప్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. యోగా ట్రైనింగ్ వీడియోలను ప్రపంచ దేశాలలో ఎక్కడ నుండైనా వీక్షించవచ్చు. యోగాసనాలు వేసే విధానం, ఏ యోగాసనాలు వేయాలి, వాటి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అనే అంశాలన్నీ ఈ యాప్ లో ఉన్నాయి.

యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు యోగాసనాలను చేయడమే కాకుండా.. యోగా ఉపయోగాలను ప్రపంచానికి తెలియజేశారు. 7 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) సిబ్బంది లడఖ్‌లోని మైనస్ సున్నా ఉష్ణోగ్రతలో 18000 అడుగుల ఎత్తులో ‘సూర్య నమస్కారం’ చేశారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఇందుకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేశారు. వీడియోలో ఐటిబిపి సిబ్బంది ఆ చల్లటి వాతావరణంలో ఆసనాలను ప్రదర్శిస్తున్నారు. 18000 అడుగుల ఎత్తులో హిమ వీరులు గొప్ప క్రమశిక్షణతో వివిధ యోగా ఆసనాలను వేసినట్లు ఐటిబిపి ఇతర వీడియోలను పంచుకుంది.

ఐటిబిపి అధికారులను హిమవీరులు అని కూడా అంటారు. హిమపాతం మధ్య లడఖ్ లో 18000 అడుగులు ఎత్తులో 7 వఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాను జరుపుకున్నారని డిడి న్యూస్ ట్వీట్ చేసింది. అందులో యోగాను అంకితభావంతో చేస్తున్న వీడియోను పంచుకుంటున్నారు.

ఐటిబిపి సిబ్బంది భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా యోగాను ప్రదర్శించారు.

గత ఏడాది చైనాతో సరిహద్దు వివాదం జరిగిన లడఖ్‌లోని గాల్వన్ లోయలో కూడా ఐటిబిపి సిబ్బంది యోగా ప్రదర్శించారు

ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం 190 దేశాలలో నిర్వహించారు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సోమవారం (జూన్ 21) ప్రధాని నరేంద్ర మోదీ ఎం-యోగా యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన వర్చువల్ ప్రసంగంలో, వుహాన్ కరోనా వైరస్ మహమ్మారి సమయంలో యోగా యొక్క ప్రాముఖ్యతను మోదీ వివరించారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జూన్ 21 ను ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ గా డిసెంబర్ 11, 2014 న ప్రకటించింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా యోగా వేడుకలు ఎక్కువ భాగం డిజిటల్‌గా జరుగుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 3 =

Back to top button