మల్లారెడ్డితో పాటు 16 మందికి నోటీసులు.. 18.5 కోట్ల నగదు స్వాధీనం

0
695

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై ఐటీ దాడులు జరిగాయి. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ దాడుల అనంతరం మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సోమవారం నుంచి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. ఐటీ దాడుల్లో రూ. 18.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకే తమపై దాడులు చేశారని.. ఇది రాజకీయ కక్షపూరితమైన చర్య అని మల్లారెడ్డి అన్నారు. వందల మంది అధికారులతో సోదాలు నిర్వహించారని, ఇలాంటి దాడులను తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఐటీ దాడులతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.