More

    కొనసాగుతున్న ఐటీ రైడ్స్.. భారీగా నగదు స్వాధీనం

    తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, భూ క్రయవిక్రయాలు, మేనేజ్‌మెంట్‌ కోటా కింద మెడికల్ సీట్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరాతీస్తున్నట్టు సమాచారం. రెండో రోజు కీలక డాక్యుమెంట్లతో పాటు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం, బుధవారం రెండు రోజుల్లో మొత్తం రూ. 8కోట్లకుపైగా స్వాధీనం చేసుకున్నట్లుగా ఐటీ అధికారులు తెలిపారు. నిన్న ఒక్క రోజే ఐటీ సోదాల్లో రూ. 4కోట్లు 80 లక్షలు స్వాధీనం చేసుకోగా.. ఇప్పటి వరకు త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ. 2కోట్లు 80 లక్షలు, మర్రి రాజశేఖర్‌‎రెడ్డి రూ. 2 కోట్లు లభించాయి. మంత్రి మల్లారెడ్డి భార్య తమ్ముడి కొడుకు సంతోష్ రెడ్డి నివాసంలో రూ. 4కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి కోడలు, కూతురిని అధికారులు బ్యాంక్‌కు తీసుకెళ్లారు. బాలానగర్ క్రాంతి బ్యాంక్‌లో లాకర్‌‌ను అధికారులు ఓపెన్ చేయించినట్లు సమాచారం. మల్లారెడ్డి కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డితో పాటు సోదరులు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఐటీ దాడులు రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది.

    Trending Stories

    Related Stories