More

    మంత్రి మల్లారెడ్డికి ఐటీ షాక్.. బంధువు ఇంట్లో భారీగా నగదు సీజ్

    తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఐటీ షాక్ ఇచ్చింది. మల్లారెడ్డి ఇండ్లతో పాటు అతని బంధువుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. మల్లారెడ్డికి సంబంధం ఉన్న సంస్థలు, కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 52 బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు రూ.2కోట్లు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి సుచిత్రలో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం నుంచి త్రిశూల్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

    మరోవైపు మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ, ఈడీ సోదాల వ్యవహారం రాష్ట్రంలో కలకల రేపుతోంది. ఇది టీఆర్ఎస్ పై కక్ష సాధింపేనని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ నేత, ఎమ్మెల్సీ రామచంద్రారావు స్పందించారు. అధికారులకు ఉన్న సమాచారంతోనే ఈడీ, ఐటీ సోదాలు జరుగుతున్నాయన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థలపై రాజకీయ ఒత్తిళ్లు ఉండవన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో టీఆర్ఎస్ పెద్ద స్క్రిప్ట్ తయారు చేసి, సినిమా చూపించిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పద్దతిలోనే బీజేపీ ముందుకు సాగుతోందని, ప్రజలు కూడా ఆదరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

    Trending Stories

    Related Stories