National

సోనూ సూద్ నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు

నటుడు సోనూ సూద్‌పై ఐటీ శాఖ చూపు సారించింది. ఆయనకు సంబంధించిన ఆరు నివాసాల్లో తనిఖీలు చేసినట్టు తెలుస్తోంది. సోనూ సూద్‌కు చెందిన ముంబైలోని వివిధ నివాసాలు, కార్యాలయాల వద్ద ప్రస్తుతం సర్వే కొనసాగుతోంది. ఆయనకు సంబంధించిన అకౌంట్స్ బుక్స్‌లో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకుని ఐటీ శాఖ ఈ చర్యలు చేపట్టినట్టు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం, ముంబై మున్సిపల్ అధికారులు కూడా సోనూపై కంప్లైంట్ నమోదు చేశారు. ఆయన ఆరు అంతస్థుల నివాస భవనాన్ని తగిన అనుమతులు లేకుండానే హోటల్‌గా మార్చాడంటూ ఆరోపించారు.

కరోనా వైరస్ మహమ్మారి ప్రబలిన సమయంలో దేశం మొత్తం లాక్ డౌన్‌లో ఉండగా ఎందరో వలస కార్మికులకు సహాయం చేశాడు. సోనూ సూద్ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే అంశంపై చాలా మందికి అనుమానాలు వచ్చాయి. ముంబయిలో ఆయనకు సంబంధించిన మరికొన్ని చోట్ల, లక్నోలోని కంపెనీల్లో తాజాగా ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం సంబంధిత వర్గాలు మీడియా వెల్లడించాయి. ఆదాయ వివరాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై ఐటీ శాఖ వివరణ ఇవ్వాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 − 9 =

Back to top button