More

    మల్లారెడ్డి కోటల్లో ‘కట్టల’ పాములు..! కోట్ల రూపాయలు సీజ్ చేసిన ఈడీ..!!

    తీగలాగితే డొంకంతా కదిలింది. మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలపై జరిగిన ఐటీ సోదాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మల్లారెడ్డి మెడికల్ కళాశాల సీట్ల భర్తీపై పలు ఆరోపణలు వచ్చాయి. కన్వీనర్ కోటా సీట్లను కూడా ప్రవేటు వ్యక్తులకు కోట్ల రూపాయలకు అమ్మకాలు చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టారు. మొత్తం నాలుగు మల్లారెడ్డి మెడికల్ కళాశాలల బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. దాదాపు 50 బృందాలుగా ఏర్పడిన అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. మంత్రి మల్లారెడ్డి బంధువులు, సన్నిహితుల గృహాల్లో చేసిన దాడుల్లో భారీగా సొమ్ము లభించినట్టు తెలిసింది. సుచిత్రలో మల్లారెడ్డి అనుచరుడైన త్రిశూల్ రెడ్డి ఇంట్లో రెండు కోట్లరూపాయల సొమ్మును సీజ్ చేసినట్టు తెలుస్తోంది. సోదాల్లో లభించిన మంత్రి మల్లారెడ్డి సెల్ ఫోన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన నివాసం పక్క క్వార్టర్స్ లో జూట్ బ్యాగ్ లో ఈ సెల్ ఫోన్ లభించింది. దీనిని మల్లారెడ్డి సిబ్బంది అక్కడ వుంచినట్టు తెలిసింది. మిత్రులారా ఈ అంశాన్ని చూసే ముందు మీరు చేయాల్సి పని గుర్తుంది కదా..! మన గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. పదిమందికీ ఈ వీడియోను షేర్ చేసి జాతీయవాద జర్నలిజానికి మద్దతు తెలపండి.

    మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కుమారులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి నివాసాలపై ఐటీ దాడులు జరిగాయి. అదేవిధంగా మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మా రెడ్డి నివాసాల్లో సైతం సోదాలు నిర్వహించారు. బాలానగర్ రాజు కాలనీలో క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వర్ రావు ఇంట్లో సైతం ఐటి సోదాలు జరిపారు.

    మల్లారెడ్డి కి చెందిన 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు సాగించారు. కళాశాలల ఆర్ధిక లావాదేవీలపై వివరాలు సేకరించారు. రికార్డులు పరిశీలించారు. కళాశాలల ఖాతాలకు సంబందించిన బ్యాంకు ల వివరాలను ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా మల్లారెడ్డి కార్యాలయాలన్నింటిలో ఐటీ సోదాలు సాగాయి.

    క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్‌ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరిపారు. జైకిషన్‌, మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్‌లు కలిసి క్యాసినోలో పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. గతంలో సైతం జైకిషన్‌ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. జైకిషన్‌ తండ్రి నరసింహ, మంత్రి మల్లారెడ్డి వ్యాపార భాస్వాములు అని గుర్తించారు. సీఎంఆర్‌ స్కూల్స్‌లో నరసింహ యాదవ్‌, మల్లారెడ్డి పార్ట్‌నర్స్‌గా ఉన్నారు. దీంతో నరసింహ యాదవ్‌, జైకిషన్‌ ఇళ్లల్లో ఐటీ దాడులు నిర్వహించారు.

    మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రఘునాథ్ రెడ్డి ఇంట్లో రెండు కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో రఘునాథ్ రెడ్డి నివాసం ఉంటున్నారు. మరోవైపు, జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో మల్లారెడ్డికి వరుసకు అల్లుడు అయ్యే సంతోష్ రెడ్డి ఇంట్లో సైతం సోదాలు చేశారు. క్రాంతి బ్యాంక్‌ చైర్మన్‌ రాజేశ్వరరావు ఇంట్లో ఐటీ సోదాలు జరిపారు. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ లావాదేవీలను అధికారులు గుర్తించారు. అలాగే కన్వీనర్‌ కోటా సీట్లను ప్రైవేటు వ్యక్తులకు అమ్మినట్లుగా అధికారులు కనుగొన్నారు. ఆయనకు ఉన్న నాలుగు మెడికల్‌ కాలేజీల ట్రాన్సాక్షన్స్ ను సైతం పరిశీలించారు.

    ఐటీ దాడులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సీట్ల భర్తీపై అనేక ఆరోపణలు ఉన్నాయని ఆయన తెలిపారు. కన్వీనర్ కోటాకి బదులు ప్రైవేటు వ్యక్తులకు కోట్లకు సీట్లు అమ్ముకున్నారని అర్వింద్ ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లుగా అర్వింద్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. మల్లారెడ్డి తన నివాసం పక్క క్వార్టర్స్ లో జూట్ బ్యాగ్ లో పెట్టిన సెల్ ఫోన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు అర్వింద్ పేర్కొన్నారు.

    Related Stories