More

    పీఎస్ఎల్వీ- సి 53 ప్రయోగం విజయవంతం

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి-53 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. గురువారం సాయంత్రం 6.02 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో నమ్మినబంటు పీఎస్ఎల్వీ అన్ని దశలను సజావుగా పూర్తిచేసుకుంది. సింగపూర్ కు చెందిన డీఎస్-ఈవో ఉపగ్రహంతో పాటు, న్యూసార్, స్కూబ్-1 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. ఈ మూడింట్లో డీఎస్-ఈవో బరువు 365 కేజీలు కాగా, అతి చిన్నదైన స్కూబ్-1 బరువు 2.8 కేజీలు మాత్రమే ఉండడం విశేషం. ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో పలువురు ఇస్రో బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

    spot_img

    Trending Stories

    Related Stories