పీఎస్ఎల్వీ సీ-52ను ప్రయోగించనున్న ఇస్రో

0
874

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టబోతోంది. ఫిబ్రవరి 14న ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం ద్వారా 1,710 కిలోగ్రాముల బరువున్న ఈఓఎస్-04 శాటిలైట్ తో పాటు మరో రెండు శాలిలైట్లను పీఎస్ఎల్వీ తనతో పాటు నింగిలోకి తీసుకెళ్లనుంది. ప్రయోగానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శాటిలైట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ 25 గంటల 30 నిమిషాల ముందుగానే ప్రారంభమవుతోంది. ఉపగ్రహాన్ని ప్రయోగించే ప్రక్రియ ఫిబ్రవరి 14 ఉదయం 4.29 గంటలకు ప్రారంభమవుతుంది. ISRO 2021లో తన రాబోయే ప్రణాళికలలో భాగంగా EOS-4 ని ప్రయోగించనున్నట్లు తెలిపింది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా, ఉపగ్రహ ప్రయోగం నిరంతరం వాయిదా పడింది. ఇప్పుడు ఇస్రో దాని ప్రయోగ తేదీని ఫిబ్రవరి 14కి నిర్ణయించింది. EOS-4/RISAT-1A మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం.

EOS-04 శాటిలైట్ ను 529 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయం, అడవులు, ప్లాంటేషన్స్, నేలలో తేమ, హైడ్రాలజీ, వరదల మ్యాపింగ్ లకు సంబంధించి ఈ శాటిలైట్ హై క్వాలిటీ ఇమేజెస్ ను తీసి, పంపిస్తుంది. మిగిలిన రెండు చిన్న శాటిలైట్లలో ఒకటి ఇన్స్పైర్ శాట్-1. దీన్ని యూనివర్శిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన లేబొరేటరీ ఆఫ్ అట్మాస్పియరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్ తో కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తయారు చేసింది. రెండో శాటిలైట్ పేరు ఐఎన్ఎస్-2టీడీ. ఇది ఇండియా-భూటాన్ జాయింట్ శాటిలైట్. పీఎస్ఎల్వీ ప్రయోగానికి లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ అప్రూవల్ లభించిన తర్వాత 25 గంటల కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. ఈ ప్రయోగంపై ISRO తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ కూడా చేసింది.