More

    పీఎస్ఎల్వీసీ-54కు కౌంట్‎డౌన్

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి కౌంట్‎డౌన్ ప్రారంభించింది. పీఎస్ఎల్వీసీ-54 ఉపగ్రహ వాహకనౌక శనివారం ఉదయం 11.56 గంటలకు ఎర్త్ అబ్ఙర్వేషన్ శాటిలైట్ EOS-06తో పాటు మరో 8 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి సంబందించి శ్రీహరికోటలోని సతీష్‎ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో గురువారం రాకెట్ సన్నధ్దత.. లాంచ్ అథరైఙేషన్ బోర్డు సమావేశాలు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 10.56 గంటలకు కౌంట్‎డౌన్ మొదలైంది. రాకెట్ నాలుగో దశ, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియ చేపట్టారు. షార్ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ సిరీస్‌లో 56వ ప్రయోగం. అలాగే ఈ ఏడాది ఇస్రో చేపట్టననున్న ఆఖరి ప్రయోగం ఇదే. పీఎస్ఎల్వీ రాకెట్‎కు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ మరోమారు తనిఖీలు నిర్వహించి కౌంట్‎డౌన్‎ను స్వయంగా పర్యవేక్షిస్తారు.

    Related Stories