యూరప్ ఖండం తన స్వహస్తాలతో మరణశాసనం లిఖిస్తోంది. బలిపీఠంపై నిల్చుని తలారికోసం ఎదురుచూస్తోంది. ఈ మాట వింటే ఆశ్చర్యం కలుగుతుంది. వాస్తవాలు తెలిస్తే మాత్రం ఆక్రోషం వస్తుంది. ఇస్లాం వలసల భూతం యూరప్ దేశాలను పట్టి పీడిస్తోంది. మారుతున్న జనాభా నిష్ఫత్తి యూరప్ ఖండానికి నిద్రలేకుండా చేస్తోంది. తూర్పుకు నాగరికత నేర్పానని నెత్తిన కిరీటం పెట్టుకుని ఊరేగిన పశ్చిమం నేడు అంతర్గత సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. ఇస్లామోఫోబియాతో తల్లడిల్లుతోంది.
ఇంతకూ యూరప్ లో ఏం జరుగుతోంది? ముస్లీం దేశాల వలసలు యూరప్ దేశాలపై ఎలాంటి ప్రభావం వేస్తున్నాయి? జాతీయవాద పార్టీలకు ఆదరణ పెరగడానికి కారణమేంటి? జనాభా పెరుగుదలపై ‘ప్యూ’ నివేదిక తేల్చిన వాస్తవాలేంటి? Douglas Murray రాసిన ‘‘The Strange Death of Europe’’ పుస్తకంలో ఏముంది? ఏ ప్రయోజనం కోసం యూరప్ దేశాలు కూటమిగా ఏర్పడ్డాయి? ‘యూరోపియన్’ భావనపై వ్యతిరేకత ఎందుకు వ్యక్తమవుతోంది? వలసలు పెరగడానికి కారణమేంటి?
ఇలాంటి ప్రశ్నలకు జవాబు వెతికే ప్రయత్నం చేద్దాం…
‘వేల్స్’ లోని మధ్యయుగాలనాటి రాజప్రసాదం ‘‘పోవిస్ కాసిల్’’లో కపోత రక్తవర్ణంలో ధగధగలాడే కెంపులు, వజ్రాలు పొదిగిన డాగర్లు… వైఢూర్యాలతో మెరిసే ఖడ్గాలూ…ఒకటేమిటి సమస్త భారత సంపద ‘పోవిస్ కాసిల్’’లో కొలువుదీరి ఉంటుంది. వలస పాలకులు మనదేశాన్ని దోచి…పట్టుకెళ్లిన సంపదంతా ఘనీభవించిన రుధిరంలా దర్శనమిస్తుంది.
విలాసం, క్రౌర్యం, దౌర్జన్యం రుచిమరిగిన ‘మొఘల్’ పాలకులపై కుట్రలూ…కుయుక్తులూ పన్ని…ఏమార్చి, అందాన్ని ఎరగా వేసిన.. ‘‘ఈస్ట్ ఇండియా కంపెనీ’’ ఉపఖండాన్ని తన దోపిడికీ అడ్డాగా మార్చింది. భారత ఉపఖండంలో బ్రిటీష్ వలసవాదులు ఏ ముస్లీం పాలకులకు ముచ్చెమటలు పట్టించారో…అదే ముస్లీం జనాభా ఇవాళ యూరప్ అంతటా వరదలా ఉప్పొంగుతోంది.
రెండో ప్రపంచ సంగ్రామం ఉత్తరార్ధగోళాన్ని ఒక్కటి చేసింది. 44దేశాలు కలగలిసి యూరప్ ఖండం ఆవిర్భవించింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగియగానే పశ్చిమదేశాలు ఒక్కటి కావాలన్న ఆకాంక్ష బయలుదేరింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ‘యూరప్’ రూపుదాల్చింది. బొగ్గు, ఇనుము, ఉక్కు కార్మాగారాలే ఊపిరిగా పురుడుపోసుకుంది యూరప్ ఖండం.
రెండు ప్రపంచ యుద్ధాల్లో తీవ్రంగా నష్టపోయింది పశ్చిమ, తూర్పు దేశాలే. మరీ ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. బ్రిటీష్ వలస వాదం సుమారు రెండువందల ఏళ్లపాటు భారత్ పాలించి, వనరులు దోపిడీ చేసి గుల్లచేసి వెళ్లిపోయింది. జపాన్ చైనాను లొంగదీసుకుని పాలించింది. అక్టోబర్ విప్లవం తర్వాత రష్యా అసాధారణ యుద్ధపిపాసను కనపరిచింది. మొత్తంగా 1944 రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ‘నిలకడ’ కావాలని కోరుకున్నాయి పశ్చిమ దేశాలు. ఈ అవసరమే యూరప్ ఏర్పాటుకు కారణమైంది.
ప్రాచీన గ్రీకు, రోమన్ సాంస్కృతిక వైభవమంతా మట్టికొట్టుకుపోయింది. యూరప్ దేశాల్లో ఒక వెలుగువెలిగిన జూడో-క్రైస్తవ మత భావనల ప్రాబల్య స్థానంలో ఇస్లాం కేంద్ర స్థానాన్ని ఆక్రమిస్తోంది. అరబ్బు దేశాల్లో పెల్లుబికిన సంక్షోభాలు, పశ్చిమాసియా అంతర్గత ఘర్షణల మూలంగా ముస్లీం జనాభా మొత్తం యూరప్ బాటపడుతోంది.
ఈ వలసదారుల సమస్యే ‘జాతీయత’ మృగ్యం అయిపోవడానికి కారణమవుతోంది. స్వదేశాల్లోనే మైనారిటీలుగా మారిపోయే ప్రమాదాన్ని గుర్తించినా నిస్సహాయ స్థితిలో మూలుగులు వినిపిస్తున్నారు ఆయాదేశాల ప్రజలు. రాబోయే పదేళ్లలో యూరప్ ఖండంలోని డజనుకు పైగా దేశాలు ముస్లీం మెజారిటీ దేశాలుగా పరిణామం చెందే అవకాశాలున్నాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
యూరప్ ఖండంలో అతిపెద్ద నదులైన…ఓల్గా, డాన్బే నదులు…రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మరోసారి రక్తవర్ణంతో ప్రత్యక్షమవుతాయా అని డజనుకు పైగా దేశాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇటీవలి కాలంలో యూరప్ దేశాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో ఇస్లామిక్ ఉగ్రసంస్థల పాత్ర గణనీయం.
యూరప్ వ్యాప్తంగా 2018 తర్వాత జాతీయవాద, మితవాద రాజకీయ పార్టీలు ఎన్నికల్లో కీలక విజయాలు సాధించాయి. కొన్ని దేశాల్లో అధికార పీఠమెక్కాయి. మరికొన్ని దేశాల్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచాయి. కొన్ని దేశాల్లో రాజకీయ ప్రాబల్యమే లేని పక్షాలు మధ్యేవాద నాయకులను జాతీయవాద విధానాలను అనుసరించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నాయి.
ఆర్థిక సంక్షోభాలు, పెరుగుతున్న వలసల నేపథ్యంలో పాలక పక్షాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత జాతీయవాద పార్టీల ముందంజకు కొంత వరకు కారణం కాగా, చాలా కాలంగా మారుతున్న పరిస్థితులపట్ల ప్రజల్లో గూడుకట్టుకొన్న భయం, జాతీయ గుర్తింపును కోల్పోతామేమోననే ఆందోళన కూడా ఈ పరిస్థితికి దారితీశాయి.
యూరప్ దేశాల్లో వేర్వేరు రాజకీయ పార్టీలు వేర్వేరు విధానాలను అనుసరిస్తున్నప్పటికీ, స్థూలంగా చూస్తే అన్ని జాతీయవాద పార్టీల మధ్య కొన్ని సారూప్యాలు కనిపిస్తున్నాయి. ముస్లింల పట్ల వ్యతిరేకత, వలసల పట్ల ఏవగింపు, యూరోపియన్ యూనియన్ పట్ల వ్యతిరేకత, ఇతర అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.
జర్మనీకి 2015లో సుమారు 10 లక్షల మంది శరణార్థులు జర్మనీలోకి ప్రవేశించారు. వీరిలో ఎక్కువ మంది సిరియా, ఇరాక్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వచ్చిన ముస్లింలు. ఫ్రాన్స్ లోని మితవాద పార్టీ ‘‘నేషనల్ ఫ్రంట్’’ నాయకురాలు మరీన్ లీ పెన్ రెండేళ్ల క్రితం ఓ ఆశ్చర్యకరమైన వ్యాఖ్య చేశారు. ‘‘వీధుల్లో ముస్లింలు ప్రార్థన చేసే దృశ్యం రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల దురాక్రమణను తలపిస్తోంది’’ అన్నారు. ఆస్ట్రియాను సైతం వలసల సమస్యే వెంటాడుతోంది.
పాఠశాలల్లో పదేళ్లలోపు బాలికలు తలకు స్కార్ఫ్‌లు కట్టుకోవడాన్ని నిషేధించాలని, వలసదారుల ఫోన్లు తీసేసుకోవాలనే ప్రతిపాదనలు ఆస్ట్రియాలో ఉన్నాయి. వలసదారులను యూరోపియన్ యూనియన్ ఆహ్వానించడాన్ని హంగేరీ, పోలండ్, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా వ్యతిరేకిస్తున్నాయి.
2017లో ‘‘PeW’’ నివేదిక ఏమందో చూద్దాం…
జనాభా, మతపరమైన అంశంపై అద్యయనం చేసిన అమెరికాకు చెందిన ప్యూ రిసెర్చ్ సెంటర్ తన అధ్యయన నివేధిక-రిలీజియస్ ప్రొఫైల్ ప్రిడిక్షన్స్ ను 2017లో విడుదల చేసింది. ఫ్యూ-Pew నిర్వహించిన సర్వే నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రప్రంచం లో వేగంగా విస్తరిస్తున్న మతం గా ఇస్లాం అవిర్భవించ బోతోంది.
2050 నాటికి క్రైస్తవుల సంఖ్య 290 కోట్లతో తొలి స్థానంలో ఉంటుందని, ముస్లింల సంఖ్య 280 కోట్లతో రెండో స్థానానికి చేరుతుందని పేర్కొంది. మొదటి సారిగా 2050 లో ప్రపంచ జనాభా లో ఇస్లాం క్రైస్తవం దాపుకు చేరబోతున్నది. 2070 నాటికి ఇస్లాం క్రైస్తవాన్ని అధిగమించవచ్చు.
ముస్లిం జనాభా లో ప్రతి ముగ్గిరిలో ఒకరు 15 సంత్సర లోపు వారు ఉంటారు. ప్రతి ముస్లిం స్త్రీకి సగటున 3 పిల్లల ఉంటారని నివేదిక పేర్కొంది. 2050 నాటికి ప్రపంచ జనాభా 900కోట్ల కు చేరవచ్చు. అప్పట్టికి ప్రపంచ జనాభా లో 1/3వంతు ముస్లింలు ఉంటారు. ప్రపంచ జనాభా లో ప్రతి 10 మంది లో ఆరుగురు క్రైస్తవులు ముగ్గురు ముస్లింలు ఉంటారని ‘ప్యూ’ తేల్చింది.
హిందువుల జనాభా కూడా ప్రపంచవ్యాప్తంగా 34 శాతం పెరిగి 140 కోట్లకు చేరుతుందని అంచనా. ప్రపంచం లో 3వ అతిపెద్ద జనాభా గా హిందువులు ఉంటారు. 2050 నాటికి భారత దేశంలోని హిందువుల జనాభా 79.5% నుంచి 76.7% కు తగ్గుతుంది,ముస్లిం జనాభా 18% కు పెరుగుతుంది.
భారత్ హిందూ మెజారిటీ దేశంగానే కొనసాగుతుందనీ, అయితే కొన్ని రాష్ట్రాల జనాభా నిష్పత్తిలో మార్పులు అసాధారణంగా ఉన్నాయని పేర్కొంది. ‘భారత దేశంలో 2050నాటికి హిందువుల జనాభా పెరగొచ్చు. అయితే, ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ముస్లిం జనాభా భారత్‌లో పెరుగుతుంది. అది ఇండోనేషియాను మించిపోతుంది’ అని నివేదిక స్పష్టం చేసింది. 2050 నాటికి ప్రపంచ జనాభా లో క్రైస్తవులు 31%, ముస్లింలు 30% ఉంటారు. హిందువులు 14.9% ఉంటారు. ప్రపంచంలో అత్యధిక ముస్లీంలను కలిగిన దేశo గా 2050 నాటికి భారత్ మొదటి స్థానానికి వస్తుందనీ ఆ సంస్థ వెల్లడించింది.
యూరప్ జనాభా లో 10% ముస్లింలు ఉంటారు. ప్రతి పది మందికి ఒక ముస్లిం ఉంటాడు. బ్రిటన్ అత్యధిక ముస్లిం జనాభా కలిగిన 3వ దేశం గా మారుతుంది. 2050 నాటికి బ్రిటన్ లో ప్రతి తొమ్మిది మంది లో ముగ్గురు ముస్లింలు ఉంటారు.
ఇంగ్లండ్ లో 79 నుంచి 52శాతానికి క్రైస్తవ జనాభా పడిపోయిందనీ, వేల్స్ లో సుమారు 40 లక్షల మంది క్రీష్టియన్ జనాభా తగ్గిందని ఇటీవలి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. యూకే ముస్లీం వలసల కారణంగా స్థానికులు మైనారిటీలుగా మారిపోతున్నారని ఆందోళనలు మొదలయ్యాయి.
అమెరికా లో ముస్లిమ్ జనాభా పెరిగి యూదుల కన్న అతి పెద్ద నాన్-క్రిస్టియన్ వర్గం రూపొందుతుంది. ప్రపంచ దేశాలలో క్రైస్తవ మెజారిటి కల దేశాల సంఖ్య 151 కు తగ్గుతుంది. 51 పైగా దేశాల జనాభా లో ముస్లీములు 50% కి పైగా ఉంటారు.
క్రైస్తవ మతాన్ని అవలంబించే యూరప్ దేశాలు అపార వనరులు ఉన్న ముస్లీం దేశాలపై దాడులు చేస్తే…అందుకు ప్రతిగా ముస్లీం మతాన్ని పాటించే దేశాల్లో ఉగ్రవాదం పెచ్చరిల్లింది. పశ్చిమ దేశాలే లక్ష్యంగా దాడులను ముమ్మరం చేశాయి ఉగ్ర సంస్థలు.
ఉగ్రవాద అణచివేత పేరుతో అమెరికా, యూరప్ దేశాలు ఇస్లామిక్ దేశాలపై దాడులు చేస్తే…వాటినుండి రక్షణ పొందేందుకు, పశ్చిమ దేశాలపై కక్ష తీర్చుకునేందుకు తిరిగి అదే పశ్చిమ దేశాల్లోకి వలసల రూపంలో అడుగుపెడుతున్నారు ముస్లీంలు.
దాడులు, దమనకాండ-యుద్ధాలు, ఆయుధాలను నమ్ముకున్న ఇస్లాం, క్రైస్తవ మతాలు చరిత్ర నిండా రక్తం మరకలు అంటించాయి. హననమే పరమావధిగా బతికాయి. దురాక్రమణకు ‘నాగరికత’ నగిషీ చెక్కింది పశ్చిమం. ఎడారి ఇసుక తుపానుల బారిన పడలేక పరాయి దేశాలపై దండయాత్రలు చేసి లూఠీ చేసిన ప్రజాధనంతో విలాసాలు అనుభవించింది నాటి ముస్లీం పాలకవర్గం.
ఆక్సఫర్డ్ ఆంగ్ల నిఘంటువులోకి మొట్టమొదట ప్రవేశించిన భారతీయ పదం ‘లూఠీ’. ముస్లీం దండయాత్రల నేపథ్యంలో పుట్టుకువచ్చిన ఈ పదాన్ని నిఘంటువులోకి చేర్చారు ఇంగ్లీషు భాషా పండితులు. ఆ తర్వాత బ్రిటీష్ పాలకులు చేసింది కూడా ‘లూఠీ’యే కావడం చారిత్రక వైచిత్రి.
Douglas Murray రాసిన ‘‘The Strange Death of Europe’’ పుస్తకంలోని చివరి భాగంలో తీవ్రమైన ప్రశ్నలు వేశారు:
Should it be a haven for absolutely anybody in the world fleeing war?
Is it the job of Europeans to provide a better standard of living in our continent to anybody in the world who wants it?
ఇదీ మొత్తంగా యూరప్ పరిస్థితి. ఈ వర్తమాన ప్రాపంచిక పరిస్థితుల నేపథ్యంలోనే సీఏఏ-ఎన్నార్సీ లాంటి చట్టాల అమలు అవసరమని భారత్ భావిస్తోంది.
చివరగా ఒక వివరణ..మరో గమనిక:
‘నేషనలిస్ట్ హబ్’ వీడియోలు చూసిన కొంతమంది వీక్షకులు ఒక పార్టీ ఛానల్ గా ఆరోపిస్తూ…అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. పూర్వాభిప్రాయాలతో వీడియోలు చూసి కామెంట్ చేసేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ వివరణ ఇవ్వబోవడం లేదు. సదభిప్రాయంతో, జాతీయ భావనతో చూసే వారికి ఈ వివరణ ఇవ్వదలచాం.
ఏదో ఒక పార్టీకో, సంస్థకో వంతపాడేందుకు ‘నేషనలిస్ట్ హబ్’ ఏర్పడలేదు. భారతదేశ చరిత్రలో 1951-52 సాధారణ ఎన్నికల తర్వాత సుమారు డెబ్భై ఏళ్లపాటు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడి, అంతలోపే విఫలమైన జనతా పార్టీలు ‘విజనరీ డెవ్ లప్ మెంట్’ విధానాలు అవలంబించలేదు. సద్యోజనిత కారణాల సాకుతో పాలనను అర్థరహితం చేశాయి. దీంతో ప్రజా జీవనంలో అభివృద్ధి ఫలాలు వికసించలేదు. అవకాశవాదం, అవినీతి, బంధుప్రీతి రాజ్యమేలాయి. 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
సుదీర్ఘ వైఫల్యాల తర్వాత జరుగుతున్న మరోకొత్త ప్రయోగమనీ, ఈ ప్రయోగం తాలూకు ఫలాలు అందేవరకూ వేచిచూడాలన్న ధోరణి కారణంగా ప్రస్తుత ప్రభుత్వ విధానాలను, సహేతుక కారణాలతో నేషనలిస్ట్ హబ్ సమర్థిస్తోంది. అంతే తప్ప ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం కోసం కాదు. విధాన నిర్ణయాలపై మా సమర్థింపు యాదృచ్చికంగా సదరు రాజకీయ పార్టీకి మద్దతుగా కనిపించవచ్చు. అది చూసేవారి దృష్టిని బట్టీ ఉంటుంది.
ఈ వీడియో కోసం మేం సంప్రదించిన పుస్తకాలు:
Douglas Murray రాసిన ‘‘The Strange Death of Europe’’, జర్మన్ పొలిటికల్ సైంటిస్ట్ Bassam Tibi రాసిన ‘‘Political Islam, World Politics and Europe’’, John Pinder రాసిన The European Union: A Very Short Introduction…