More

  పోలియో వ్యాక్సిన్‎తో ప్రాణాలు పోతాయా..?!

  పాకిస్తాన్ క్వెట్టాలో ఉగ్రవాద దాడి జరిగింది. చిన్న పిల్లలకు వేసే పోలియో వ్యాక్సిన్లను ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలిస్తుండగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పాక్ ప్రభుత్వం ఈ దాడి ప్రమాదాన్ని ముందే పసిగట్టింది. భారీ భద్రత కల్పించి.. పోలియో వ్యాక్సిన్లకు తరలించడానికి ప్రయత్నించింది. అయితే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి వ్యాక్సిన్ల తరలింపును అడ్డుకున్నారు. ఈ దాడిలో 28 మంది గాయాలపాలవగా,.. ఐదుగురు మరణించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ధృవీకరించింది. ఈ దుర్మార్గానికి పాల్పడింది తామేనని ‘తెహ్రీక్-ఇ-తాలిబాన్’ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. అయితే ఈ దాడికి ఉగ్రసంస్థ చెప్పిన కారణం మాత్రం,.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆధునిక ప్రపంచాన్ని,.. మళ్ళీ 1500 ఏళ్ళ క్రితం నాటికి తీసుకుపోతున్నారా..? అన్న సందేహాన్ని కలిగిస్తోంది. అయితే ఆ కారణమేంటో తెలుసుకోవడానికి ముందు.. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి.. పదిమందికీ షేర్ చేయండి.

  ఇక, స్టోరీలోకి వెళితే.. తాజా ఉగ్రవాద దాడిని సమర్థించుకుంటూ ‘తెహ్రీక్-ఇ-తాలిబాన్’ ఓ కారణం చెప్పింది. పోలియో వ్యాక్సిన్లు ఇస్లాం మూల సూత్రాలకు వ్యతిరేకమని.. ఈ వ్యాక్సిన్ల వల్ల ఇస్లాం యువకుల్లో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందని తెలిపింది. వీటిని ముస్లిం యువకులు ఉపయోగిస్తే తమ జనాభా తగ్గిపోతుందని వింత వాదన వినిపించింది. దీంతో పాటు ఈ వ్యాక్సిన్లు అనేవి అగ్రరాజ్యాలు చేస్తున్న కుట్రలో భాగమనీ,.. తమ సమాజాన్ని మరింత తగ్గించే ప్రయత్నంలో భాగంగానే.. ఈ వ్యాక్సిన్లను ఉపయోగిస్తున్నారని ‘తెహ్రీక్-ఇ-తాలిబాన్’ తెలిపింది. అందుకోసమే ఈ వ్యాక్సిన్లను పాకిస్తానీ యువకులకు వేయకుండా,.. తాము అడ్డుకుంటున్నామని స్పష్టం చేసింది. ఇలా ప్రతీసారి పోలియో చుక్కల మందుకు ఉగ్రవాదులు అడ్డుతగులుతుండటంతో.. వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగడం లేదు. దీంతో పాకిస్తాన్ లో చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయడం,.. అక్కడి వైద్య అధికారులకు తలకు మించిన భారంగా తయారైంది. పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొంటే.. ఉగ్రవాదులు తమను ఎక్కడ చంపేస్తారోనన్న భయాందోళన అందరిలోనూ నెలకొంది. అయితే పాకిస్తాన్ లో పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ పై దాడులు జరగటం ఇదే మొదటిసారి కాదు. గతంలో పోలియో పంపిణీ కేంద్రాలే టార్గెట్ గా ఎన్నో ఉగ్రవాద దాడులు జరిగాయి.

  ప్రతి ఏటా పాకిస్తాన్ లో పోలియో వ్యాక్సిన్ ను ప్రజలకు పంపిణీ చేయడం పెద్ద ప్రహసనంగా మారుతోంది. ఒక్కో పోలియో అధికారికి ఇద్దరు సాయుధులతో రక్షణ కల్పించాల్సి వస్తోంది. ఇదే సంవత్సరం ఆగస్టు నెలలో ఓ ఆరోగ్యశాఖ అధికారి పోలియో చుక్కల పంపిణీకి వెళ్ళారు. అతడికి కూడా ఇద్దరు సాయుధులతో రక్షణ కల్పించారు. అయితే మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు వీరిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్యశాఖ అధికారి తృటిలో తప్పించుకున్నారు. ఇక 2016లో పోలియో కేంద్రం టార్గెట్ గా జరిపిన దాడిలో,.. ఏకంగా 15 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ఈ విధంగా ప్రతియేటా పోలియో వ్యాక్సిన్ల పంపిణీని ఉగ్రవాదులు దాడులు చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2012 నుంచి 2016 వరకు పోలియో కేంద్రాలే టార్గెట్ గా జరిగిన ఉగ్రదాడుల్లో దాదాపు 60 మంది వరకు ఆరోగ్య శాఖ అధికారులు, రక్షణ అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. దీంతో పాకిస్తాన్ లో చిన్నపిల్లలకు పోలియో వ్యాక్సిన్లను అందించడం తీవ్రమైన సమస్యగా మారుతోంది. దాడులు ఎక్కువగా పెరిగిపోతుండటం, వైద్య శాఖ అధికారులకు సరైన భద్రత కల్పించినా,.. దాడులు ఆగడం లేదు. దీంతో పాక్ ప్రభుత్వానికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది.

  ఇటువంటి ఉగ్రవాద దాడులతో పాకిస్తాన్ ఇప్పటికీ పోలియో బాధిత దేశంగానే మిగిలిపోయింది. ఇప్పటికే ప్రపంచదేశాలన్నీ పోలియోను పారద్రోలి ఈ వ్యాధి బారినుంచి తమ ప్రజలను రక్షిచుకున్నాయి. అయితే ప్రపంచంలో కేవలం రెండే దేశాలు పోలియో సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. కేవలం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లు మాత్రమే పోలియో వ్యాధి తీవ్రతను ఇప్పటికీ ఎదుర్కొంటున్నాయి. అయితే ఉగ్రవాదులు ఈ పోలియోను అడ్డుకుని సాధించేదేమిటి..? అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ ప్రపంచమే కుగ్రామంగా మారింది. ప్రతి దేశమూ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం వచ్చింది. అగ్రదేశమైన రష్యాపైనే పూర్తి ఆంక్షలు విధించడంతో.. ఏమీ చేయలేక చైనా భారత్ లను ఆశ్రయిస్తోంది. అయితే పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు మాత్రం తమ ఉన్మాద ధోరణితో పాతకాలంనాటి విధానాలనే పట్టుకుని వేలాడటం ఎంతవరకు సమంజసం అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరముంది.

  ప్రపంచదేశాలన్నీ పోలియో వ్యాక్సిన్లను ఉపయోగించి ఆ వ్యాధినుంచి బయటపడ్డాయి. ఈ వ్యాధి మహమ్మారి నుంచి తమ ప్రజలను కాపాడుకుంటున్నాయి. అయితే తాలిబన్ ఉగ్రవాదులు మాత్రం ఉన్మాదంతో వ్యవహరించి,.. అదేదో అంతర్జాతీయ కుట్ర అంటూ వ్యతిరేకించడం.. తమ సమాజానికి ఏమాత్రం మేలు చేస్తుందో ఆలోచించుకోవాలి. ముస్లిం యువకుల పునరుత్పత్తి మాట అటుంచితే.. వారిని జీవితాంతం అంగవైకల్యంతో బాధపడడేలా చేసి.. ఉగ్రవాదులు సాధించేదేమిటి..? దీంతో పాటు ఉగ్రవాదులు చెబుతున్నట్లుగా పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందనే వాదన ఎంతవరకు నిజం అన్నది వారికే తెలియాలి. ఒకవేళ పోలియో వ్యాక్సిన్ పునరుత్పత్తిని దెబ్బతీస్తుందనే వాదనే సరైనది అయితే,.. ప్రపంచంలో చాలా దేశాల్లో పునరుత్పత్తి ఆగిపోవాలి. కానీ, వాస్తవానికి అలా జరగడం లేదు. పైగా ప్రపంచ జనాభా రోజురోజుకూ పెరుగుతూనే వుంది. పోలియో వల్ల పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతున్నట్టు చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. నిజంగా అదే నిజమని నిరూపించాలనుకుంటే.. పరిశోధనలు చేసి ఆ విషయాన్ని బయటపెట్టాలి. అంతేకానీ ఎటువంటి పరిశోధనలు లేకుండా గుడ్డిగా వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసం అన్నది ఉగ్రవాద సంస్థలే తేల్చుకోవాల్సి ఉంటుంది.

  అయితే ఇక్కడ సమస్య ఉగ్రవాదులది కాదు. నిజానికి ఈ సమస్య ఆయా దేశాల్లోని ప్రజలది,.. ప్రభుత్వాలది. ప్రపంచానికి ఉగ్రవాదాన్ని పరిచయం చేసిన పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రవాదంతో ప్రజల ప్రాణాలకే ముప్పును తెస్తోంది. ఉన్మాద ధోరణితో పాకిస్తాన్ ప్రజలు అష్టకష్టాల పాలవుతున్నారు. దాడికి పాల్పడిన ‘తెహ్రీక్-ఇ-తాలిబాన్’ మాతృసంస్థ తాలిబన్ ఉగ్రవాదమే.. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా రాజ్యమేలుతుండటంతో అక్కడ కూడా ప్రజలు పోలియో బారినుంచి ఇప్పటికీ బయటపడలేకపోతున్నారు. అందుకే,.. మతోన్మాదంతో చెడును పెంచిపోషిస్తే ఎప్పటికైనా అదే కాటేసి చంపుతుందన్న సత్యాన్ని,.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు గ్రహించి,.. ఉగ్రవాదాన్ని వదిలించుకోవాల్సి ఉంది. లేకపోతే కేవలం పోలియో వల్లనే కాదు.. ఉగ్రవాదంతో వచ్చే సమస్యలతో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

  Trending Stories

  Related Stories