అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ నగరంలోని కార్తే పర్వాన్ గురుద్వారా లక్ష్యంగా శనివారం బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ఉగ్రసంస్థ ప్రకటించింది. గురుద్వారాపై దాడికి పాల్పడింది తామేనని ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు. మహమ్మద్ ప్రవక్తను కించపరిచినందుకు ప్రతిగా ఈ దాడి జరిపినట్లు వెల్లడించారు. తమ సభ్యుడొకరు హిందూ, సిక్కు సహా వారికి మద్దతు ఇస్తున్నవర్గాలే లక్ష్యంగా దాడికి పాల్పడినట్లు ఐసిస్ గ్రూప్ ఇస్టామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ సభ్యులు టెలికాం గ్రూప్‌లో పోస్ట్ చేశారు. మహమ్మద్ ప్రవక్తను కించపరిచినందుకు ప్రతిగా ఈ దాడి జరిపినట్లు వెల్లడించారు. గురుద్వారా లక్ష్యంగా బాంబు దాడి జరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని సిక్కులు, హిందువులు భారత్ కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గానూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇస్లామిక్ దేశాలన్నీ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.