More

    మహిళా జడ్జినీ వదలని ఇమ్రాన్ ఖాన్.. అరెస్ట్ వారెంట్ జారీ

    తహ్రిక్-ఇ-ఇన్సాఫ్ నాయకుడు, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ నోటిదురుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమయం.. సందర్భం లేకుండా.. ఎవరిని పడితే వారిని తిట్టడమే అతడికి పని.. అలా తిట్టి తిట్టి ఇప్పటికే చాలా పోగొట్టుకున్నాడు. ఎన్నో కేసులను కూడా ఎదుర్కొంటూ ఉన్నాడు. తాజాగా ఇస్లామాబాద్‌లోని మేజిస్ట్రేట్ 30 సెప్టెంబర్ 2022న ఇమ్రాన్ ఖాన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు హాజరు కాకపోవడంతో సీనియర్ సివిల్ జడ్జి రాణా ముజాహిద్ రహీమ్ ఈ వారెంట్ జారీ చేశారు. మహిళా న్యాయమూర్తిని బెదిరించినందుకు అతనిపై కేసు నమోదైంది.

    2022 ఆగస్టు 20వ తేదీన ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ జిల్లా, సెషన్స్ జడ్జి జెబా చౌదరిని బెదిరించినట్లు ఇమ్రాన్ ఖాన్ పై అభియోగాలు మోపారు. ఆగస్టు 20న అతనిపై కేసు నమోదైంది. ఇమ్రాన్ ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్‌లో పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.జడ్జి జెబా చౌదరిపై చేసిన వ్యాఖ్యలకు గానూ పీటీఐ చీఫ్ కోర్టు ధిక్కార ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 17న తన సహాయకుడు షాబాజ్ గిల్ ను రెండు రోజుల పోలీసు కస్టడీని ఆమోదించినందుకు న్యాయమూర్తికి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో కేసు నమోదైంది.. విచారణకు హాజరు కాకపోవడంతో ఇమ్రాన్ ఖాన్ పై అరెస్టు వారెంట్ జారీ చేశారు.

    Trending Stories

    Related Stories