Right Angle

ఆయుర్వేదం Vs అల్లోపతి
ఆనందయ్య మందుకు దారేది..?

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. రెండో దశ విజృంభణతో భారత్ లో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. క్రియాశీల కేసుల్లో తగ్గుదల ఊరటనిస్తున్నా.. మరణాల గ్రాఫ్ ఇంకా డౌన్ టర్న్ తీసుకోలేదు. ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభా కలిగిన భారత్ లో ఆగమేఘాల మీద వ్యాక్సినేషన్ పూర్తిచేసి మహమ్మారికి అడ్డుకట్ట వేయడం అంత సులువైన విషయం కాదు. మరి, అప్పటివరకు మహమ్మారి విస్తృతిని అడ్డుకోవడం ఎలా..? దీనికి ఏకైన పరిష్కారం కరోనా మెడిసిన్. ఇప్పటివరకు వ్యాక్సిన్లయితే అందుబాటులోకి వచ్చాయి గానీ, కరోనా మందుపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. ఇటీవల డీఆర్డీఓ తీసుకొచ్చిన 2డీజీ మందు ఆశలు కల్పిస్తున్నా.. ఇంకా పూర్తిస్థాయిలో అది అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో భారతీయ సంప్రదాయ వైద్య విధానం నేనున్నానంటూ అభయ హస్తం అందిస్తోంది. కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కరోనా మందు ఆశలు కల్పిస్తోంది.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన బొణిగెల ఆనందయ్య అనే ఆయుర్వేద నిపుణుడు అందిస్తున్న కరోనా మందుపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కరోనా సివియారిటీ ఎంత తీవ్రంగా వున్నా.. వైరల్ లోడ్ ఎంత ఎక్కువగా వున్నా ఆనందయ్య మందు వాడితే ఒక్కరోజు లోనే నయమైపోతోందట. కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రిపోర్ట్ వస్తోందట. ఇది ఆ మందును వాడినవారు చెబుతున్న మాట. కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కరోనా బాధితులు సైతం ఆనందయ్య ఆయుర్వేద మందుతో కోలుకుంటున్నారని చెబుతున్నారు. ఊపిరాడక కొనప్రాణంతో కొట్టుమిట్టాడిన ఎంతోమంది కరోనా బాధితులు సైతం కోలుకున్నట్టు వీడియో సాక్ష్యాలు కూడా వున్నాయి. సీటీ స్కాన్ సివియారిటీ లెవల్ 24/25 వున్న పేషెంట్లు సైతం ఈ మందు తీసుకోగానే మంత్రమేసినట్టు కోలుకుంటున్నారు. అటు కరోనా సోకనివారు ఈ మందు వాడితే మహమ్మారి దరిచేరడం లేదు.

ఇప్పటికే దాదాపు లక్షమంది ఈ మందును వాడినట్టు తెలుస్తోంది. అయినా, ఒక్కరి నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మందు విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్నాటక, తమిళనాడు నుంచి కూడా జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద మందువల్ల 11 వేల జనాభా వున్న కృష్ణపట్నం మేజర్ గ్రామ పంచాయితీలో పూర్తిగా కరోనా లేకుండా పోయిందని.. ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని సమాచారం. మందులో వాడే పదార్ధాలు కూడా మనందరికీ తెలిసినవే. పటిక బెల్లం, పచ్చ కర్పూరం, మిరియాలు, ధనియాలు, పసుపు, తేనె, వంటివి ఇంకొన్ని పదార్థాలు కలిపి చేస్తున్న ఈ ఆయుర్వేద మందు చైనా వైరస్ ను సమూలంగా చంపేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, మందు ఎంత ప్రభావితమైనదైనా.. దానిని ప్రభుత్వాలు గుర్తించాలంటే శాస్త్రీయ పరిశోధన అవసరం. ఆ మందుపై శాస్త్రీయ పద్దతిలో అధ్యయనం జరగాలి. అప్పుడే దానికి గుర్తింపు లభిస్తుంది. ఆనందయ్య ఆయుర్వేద మందుకు కూడా ఇవే సమస్యలు ఎదురవుతున్నాయి. మన దేశంలో లక్షలు పోసైనా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటారు తప్పితే.. సంప్రదాయ ఆయుర్వేద వైద్యాన్ని మాత్రం నమ్మరు. ప్రజలే కాదు, ప్రభుత్వాలు కూడా అంతే.

ఆనందయ్య కరోనా మందు సత్తా ఏంటో తేల్చేందుకు ఐసీఎంఆర్ రంగంలోకి దిగింది. ఆయుర్వేద మందుపై అధ్యయనం ప్రారంభించింది. ఈ అధ్యయనం పూర్తయి ఐసీఎంఆర్ అనుమతులు ఇస్తే మంచిదే. కరోనా మహమ్మారి నుంచి దేశమే కాదు.. ప్రపంచం మొత్తం బయటపడుతుంది. మరి, ఐసీఎంఆర్ అనుమతులు ఇస్తుందా..? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

నిజానికి, కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాకముందే మనదేశంలో కరోనాకు ఆయుర్వేదం, సిద్ధ వైద్యం అందుబాటులోకి వచ్చింది. అనధికారికంగా ఎంతో మంది ఈ వైద్య విధానాల నుంచి ఉపశమనం పొందారు. పొందుతున్నారు. కానీ, ఇవన్నీ బయటికి రావడం లేదంతే. గతేడాది ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ కృష్షకుమార్ నేతృత్వంలోని బృందం.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందును కనిపెట్టినట్టు ప్రకటించింది. ఈ మందుకు సంబంధించిన పూర్తి డేటాను ఐసీఎంఆర్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఆయుష్ శాఖకు సమర్పించింది. కానీ, ఎప్పటిలాగే మోడ్రన్ మెడిసిన్ నియమనిబంధనలు సంప్రదాయ మందును ముందుకు రానివ్వలేదు. మోడ్రన్ మెడిసిన్ చదువుకున్న ఐసీఎంఆర్ బాసులు.. భారతీయ సంప్రదాయ ఔషధాన్ని పక్కనపెట్టేశారు. ఒక్క డాక్టర్ కృష్ణకుమార్ మాత్రమే కాదు.. ఎంతో మంది ఆయుర్వేద నిపుణులు ఆయుష్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయినా, ఫలితం శూన్యం.

నిజానికి, దేశంలో ఆయుర్వేద, సిద్ధ, యునానీ వంటి భారతీయ సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకే మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆయుష్ శాఖను ఏర్పాటు చేసింది. కానీ, ఆ శాఖ అధికారులు సైతం పాశ్చత్య వైద్య శాస్త్రాన్ని అనుసరించేవారే కదా. దీంతో అల్లోపతి నియమ నిబంధనల ముందు ఆయుర్వేదం నిలదొక్కుకోలేకపోయింది. అసలు ఆయుర్వేద మందును అల్లోపతి కోణంలో చూడటమే పెద్ద పొరపాటు. సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు ఇవ్వలేని మోడ్రన్ సైన్స్.. రోగం మూలాలను సైతం నాశనం చేసే సత్తా వున్న ఆయుర్వేదానికి ఎంతో తేడా వుంది. మనిషి ప్రాణం పోయిన తర్వాత ఆ శవాన్ని కోయడంతో మోడ్రన్ సైన్స్ పాఠాలు మొదలవుతాయి. దీనినే వాళ్లు గొప్పగా హ్యూమన్ ఎనాటమీ అని చెప్పుకుంటారు. కానీ, ఆయుర్వేదం అలా కాదు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి, సూర్యనమస్కారాలు, ప్రాణాయామాలతో మొదలయ్యే ప్రాణాధార ప్రక్రియల నుంచి ఆయుర్వేదం మొదలవుతుంది. పాశ్చాత్యులకు తెలియని రోజుల్లోనే.. ఈ భారతీయ సనాతన సత్సంప్రదాయ వైద్య విధానంలో పెద్ద పెద్ద సర్జరీలు జరిగాయి. వేల యేళ్ల క్రితమే ప్రపంచానికి వైద్య శాస్త్రాన్ని అందించిన శుశ్రూతుడు పుట్టిన దేశం మనది. లక్ష మొక్కలకు సంబందించిన వైద్య ప్రయోజనాలను వివరించి.. ఆయుర్వేదం ఆధారంగా ప్రపంచానికి వైద్యభిక్షపెట్టిన చరకుడు పుట్టిన దేశం మనది. రసాయనిక, మౌలిక, లోహశాస్త్రాల్లో విశేష కృషిచేసిన ఆచార్య నాగార్జునుడు పుట్టిన దేశం మనది. అలాంటి ఎందరో మహానుభావులు భారతీయ సంప్రదాయ వైద్యవిధానానానికి ఊపిరులూదారు. ఆయుర్వేదం, సిద్ధ వైద్యం వంటి అనేక వైద్య విధానాలు అలాంటి మహానుభావుల పుణ్యమే. నేడు ఆనందయ్య అందిస్తున్న కరోనా మందు సైతం ఆయుర్వేద మూలాల నుంచి పుట్టిందే. కరోనా మహమ్మారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న తరుణంలో ఆనందయ్య కరోనా మందు సంజీవినిలా కనిపిస్తోంది. అయితే, ఈ మహత్తర ఔషధానికి ఎప్పటిలాగే మోడ్రన్ సైన్స్ అడ్డుపడుతోంది. అయినా, ఆయుర్వేదం మందు ప్రభావాన్ని అల్లోపతి విధానంలో లెక్కగట్టడమే పెద్ద పొరపాటు. మోడ్రన్స్ సైన్స్ ప్రొటోకాల్స్ ప్రకారం.. ఆనందయ్య కరోనా మందును లెక్కగడితే.. ఫలితం వ్యతిరేకంగానే వస్తుంది. అందులో వాడిన ఈ ఆకు మంచిది కాదనో.. ఇంకో పసరు ప్రమాదమనో చెబుతారు.

అసలు ఆయుర్వేదం సాధించనిది.. మోడ్రన్ సైన్స్ ఏం సాధించదని..? వందల ఏళ్ల క్రితం ఎనిమిది కోట్ల మందిని పొట్టన బెట్టుకున్న స్పానిష్ ఫ్లూ వైరస్ ఇంతవరకు వ్యాక్సిన్ కనుక్కోలేదు. ఎన్నో రీసెర్చ్ లు జరిగాయి. కానీ, ఫలితం శూన్యం. స్పానిష్ ఫ్లూ అంతుతేల్చేందుకు 1948లో లండన్ లో ప్రారంభమైన కోల్డ్ రీసెర్చ్ సెంటర్ యాభై ఏళ్లలో అనేక పరిశోధనలు చేసింది. వందలాది పరిశోధనా పత్రాలను ప్రచురిచింది. కానీ, స్పానిష్ ఫ్లూ వ్యాక్సిన్ మాత్రం కనుక్కోలేకపోయారు. 500 మిలియన్ పౌండ్లు ఖర్చు చేసిన తర్వాత 1999లో కోల్డ్ రీసెర్చ్ సెంటర్ మూత పడింది. అయితే, ల్యాబొరేటరీ మూత పడేముందు శాస్త్రవేత్తల నుంచి ఓ సంచలన ప్రకటన వెలవడింది. అదేంటే, మేం ఇన్నేళ్ల కృషి తర్వాత స్పానిష్ ఫ్లూ వ్యాక్సిన్ కనుక్కోలేకపోయాం. కానీ, ఈ ఫ్లూ వ్యాక్సిన్ కనుక వస్తే అది భారత్ నుంచే వస్తుందని ప్రకటించారు. భారతీయ సంప్రదాయ వైద్యం నుంచే ఫ్లూ వ్యాక్సిన్ వస్తుందని ప్రముఖ హృద్రోగ నిపుణులు, మణిపాల్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సిలర్ గా పనిచేసిన ప్రొ. బి.ఎం. హెగ్డే ఘంటాపథంగా చెప్పారు. ‘వాట్ డాక్టర్స్ డోంట్ గెట్ ద స్టడీ ఇన్ మెడికల్ స్కూల్స్’ పేరుతో ఆయన పుస్తకంలో దీనిపై అనేక విషయాలను ప్రపంచం ముందుంచారు. అదీ భారతీయ సంప్రదాయ వైద్యవిధానానికి వున్న సత్తా. ఆనందయ్య ఆయుర్వేద మందు ఇదే నిజమని నిరూపిస్తోంది. లక్షల మంది వాడినా ఒక్కటంటే ఒక్కటి కూడా సైడ్ ఎఫెక్ట్ ఇప్పటివరకు నమోదు కాలేదు. మరి, అధ్యయనం పేరుతో కాలయాపన చేయడం సమంజసమా..?

శాస్త్రీయ అధ్యయనం పేరుతో మహా ఔషధాన్ని అడ్డుకోవడం అవివేకమే అవుతుంది. అసలు కరోనాకు బ్రహ్మాస్త్రాలుగా చెప్పుకుంటున్న వ్యాక్సిన్లు శాస్త్రీయ అధ్యయనం జరిగిందా..? నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఏ వ్యాక్సిన్ కూడా ప్రభావితమైందని శాస్త్రీయంగా నిరూపించబడలేదు. అసలు ఒక వ్యాక్సిన్ పై పూర్తి అధ్యయనం జరగాలంటే.. క్లినికల్ ట్రయల్స్ కే కనీసం పదేళ్లు పడుతుంది. ప్రస్తుతం అందుబాటులో వున్న కరోనా వ్యాక్సిన్లు సత్ఫలితాలనిస్తే ఇవ్వొచ్చు గాక.. కానీ, ఈ వ్యాక్సిన్లన్నీ అత్యవసర పరిస్థితుల్లో ఆమోందిచుకున్నవే. పరిస్థితి నుంచి గట్టెక్కడానికి నిబంధనలను సడలించిన వినియోగంలోకి తెచ్చినవేనన్న విషయాన్ని మర్చిపోరాదు. అత్యవసర వినియోగం కోసం అప్రూవ్ చేసిన ఈ వ్యాక్సిన్లు పూర్తి సురక్షితమని ఏ డేటా ఆధారంగా చెప్పగలం..? ఈ కోణంలో ఆలోచిస్తే అత్యసవర వినియోగం కింద ఆనందయ్య మందుకు కూడా అనుమతులు ఇవ్వడంలో తప్పేంటి..? సరే, అసలు ఐసీఎంఆర్ అనుమతులు ఇస్తుందా..? లేదా..? అన్న విషయం పక్కనపెడితే.. ఫార్మా లాబీయింగే ఈ మందుకు అడ్డుపడే సూచనలు కనపడుతున్నాయి. ఎందుకంటే, ఆనందయ్య ఆయుర్వేద మందు కనుక అందుబాటులోకి వస్తే.. కార్పొరేట్ ఫార్మా సంస్థల ఆదాయానిక భారీ గండిపడుతుంది. దీంతో ఈ మందుకు అనుమతులు రాకుండా.. ఫార్మా కంపెనీలు శతవిధాలా ప్రయత్నించే ఛాన్స్ లేకపోలేదు. నిజానికి, భారతీయ సంప్రదాయ వైద్యానికి ఫార్మా లాబీయింగ్ ఎప్పటినుంచో పెనుసవాలు విసురుతోంది.

ప్రస్తుతం అగ్ర రాజ్యాల నుంచి అభివృద్ది చెందుతున్న దేశాల వరకు.. అన్ని దేశాల ఆర్థిక పురోగతి ప్రభావితం చేస్తున్నది ప్రధానంగా మూడు అంశాలు. నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న మూడు ముఖ్యమైన రంగాలు.. ఒకటి డిఫెన్స్, రెండు ఆయిల్, మూడు ఫార్మా. అగ్రారాజ్యాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల వరకు ఈ మూడు రంగాలకు తలొగ్గాల్సిందే. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎన్నో ఫార్మా కంపెనీలు అమెరికా ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేస్తున్నాయడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అగ్రదేశాల ఆర్థిక వనురుల్లో ఫార్మాది కీలక భాగస్వామ్యం. భారత దేశ ఆర్థికాభివృద్ధిలోనూ ఫార్మా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ ఫార్మా రంగంలో ఎదురులేని దేశాల్లో భారత్ ది అగ్రస్థానం. దేశ ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేస్తున్న రంగాల్లో ఫార్మాదే పైచేయి. ఎందుకంటే, డిఫెన్స్ లో ఇన్నాళ్లు దిగుమతులపై ఆధారపడిన భారత్.. మేకిన్ ఇండియా వెన్నుదన్నుతో ఇప్పుడిప్పుడే ఎగుమతులు చేయడం ప్రారంభించింది. ఇక, ఆయిల్ సెక్టార్ మనకు ఆమడదూరంలోని అంశం. ఇక, మిగిలింది ఫార్మా. మరి, అలాంటి ఫార్మా లాబీయింగ్ ను కాదని ప్రభుత్వం సంప్రదాయం ఆయుర్వేదానికి మొగ్గుచూపడం సాహసమే అవుతుంది. అలా చేస్తే.. భారత ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ ఫార్మా కంపెనీల ఆదాయానికి గండిపడినట్టే. అందుకే మోడ్రన్స్ సైన్స్ ప్రొటోకాల్స్ కి ప్రభుత్వాలు తలొగ్గక తప్పడం లేదు.

మరి, ఇలాంటి విపత్కర సమయంలోనూ ప్రొటోకాల్స్ తో కాలయాపన చేయడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా, అల్లోపతిని, ఆయుర్వేదాన్ని ఒక్క గాటిన కట్టకుండా.. మోడ్రన్స్ సైన్యం స్టాండర్ట్స్ నుంచి బయటికొచ్చి.. భారతీయ సంప్రదాయ వైద్య విధానాలైన ఆయుర్వేదం, సిద్ధవైద్యం, యునానీ వంటి వైద్య విధానాలను ప్రత్యేక ప్రమాణాలు రూపొందించాలి. ఆ ప్రమాణాల మేరకే ఆయుర్వేద ఔషధాలపై క్లినికల్ ట్రయల్స్ జరపాలి. అంతేగానీ, పూర్తి విరుద్ధమైన అల్లోపతీ స్టాండర్డ్స్ లో ఆయుర్వేద మందుకు క్లినికల్ ట్రయల్స్ జరిపితే ఫలితాలు కచ్చితంగా భిన్నంగానే వుంటాయి. అంతవరకు, ఆనందయ్య లాంటి ఆయుర్వేద నిపుణులు ఎంతటి మహా ఔషధాలను తయారుచేసినా.. అల్లోపతి నిబంధనల ముందు నిలవలేవు.

నిజానికి, భారతీయ సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడానికే మోదీ ప్రభుత్వం ఆయుష్ శాఖను ఏర్పాటు చేసింది. అయితే, ఆ శాఖ కూడా మోడ్రన్ సైన్స్ విధి విధానాలకే కట్టుబడుతుండటం ప్రధాన సమస్యగా మారింది. అలా అని మోడ్రన్ సైన్స్ ను తక్కువ చేయాలని చెప్పడం లేదు. అల్లోపతి అయినా, ఆయుర్వేదమైనా దేని విశిష్టత దానికి వుంది. వేగవంతమైన వ్యాధినిర్ధారణలో అల్లోపతి వైద్య విధానం అసరమే. కానీ, ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఔషధాలు అందించడం అల్లోపతికి అసాధ్యమైన విషయం. దీంతో అటు మోడ్రన్ సైన్స్ ను ప్రోత్సహిస్తూనే.. ఆయుర్వేదానికి సైతం అండదండలు అందించాలి. అప్పుడే కరోనా లాంటి ఎన్ని మహమ్మారులు ఎదురైనా ఎన్ని ఎదిరించగలం.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

thirteen − three =

Back to top button