వివాదంపై విఘ్నేష్ అలా స్పందించాడా..?

0
857

ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ ఇటీవలే తల్లిదండ్రులయ్యారు. ఆదివారం, అక్టోబర్ 9న విఘ్నేష్ శివన్ ట్విట్టర్ ద్వారా ఈ శుభవార్త పంచుకున్నారు. తమ పిల్లలతో ఆ జంట ఉన్న ఫోటోను పోస్టు చేశారు. అయితే ఈ దంపతులు వివాదంలోనే చిక్కుకున్నారు. అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడంపై 2019లోనే సుప్రీంకోర్టు స్పష్టతను ఇచ్చింది. ఈ పద్ధతి ద్వారా పిల్లలను కనడం నేరమని తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా నయనతార అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనిచ్చిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సరోగసీ ద్వారా పిల్లలను కన్నట్టయితే నయనతార, విఘ్నేష్ లకు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ నయన్ దంపతులకు తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు పంపింది.

ఈ సమయంలో విఘ్నేష్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు, అందులో ‘మన వెన్నంటే ఎల్లప్పుడు ఉండి, మన బాగోగులు చూసుకునేవారి అభిప్రాయాలను గౌరవించు. వారే మంచి గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్లే నీ వాళ్లు. ఎప్పటికి ఇదే వాస్తవం’’ అని విఘ్నేశ్ శివన్ తెలిపాడు. ‘‘సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని నీకు లభిస్తాయి. అంత వరకు సహనంతో ఉండు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకో’’ అని ఉంది.