More

    నందమూరి బాలకృష్ణ కబ్జా చేశారంటూ ఆరోపణలు

    నందమూరి బాలకృష్ణ ఇల్లు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెం 45 ముందు ఉంటుంది. అలా వెళ్తున్న వారంతా.. తెలియని వాళ్లకు ఇది బాలయ్య ఇల్లు అంటూ చూపిస్తూ ఉంటారు. అయితే ఆ ఇల్లు గురించి సంచలన ఆరోపణలు చేశాడు ఒక వ్యక్తి. ఆ ఇంటి ముందు ఉన్న స్థలాన్ని బాలయ్య కబ్జా చేసినట్లు చెప్పుకొస్తూ ట్వీట్ చేశాడు. విజయ గోపాల్ ట్వీట్ చేస్తూ బాలయ్య ఇంటి ముందు ఉన్న పేవ్ మెంట్ ప్రభుత్వ స్థలమని, దాన్ని బాలయ్య అక్రమంగా కబ్జా చేసారని చెప్పుకొచ్చాడు. “ఇప్పటికి నాకు అర్ధం కాలేదు.. బాలకృష్ణ ఇంటి ఎదురు అంత పేవ్ మెంట్ ను కబ్జా చేసి పచ్చని మొక్కలు పెంచుతుంటే జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తోంది.. ఇలాంటి పని ఒక సామాన్యుడు చేస్తే ప్రభుత్వం ఉరుకొంటుందా” అని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ట్వీట్ చేసిన విజయ గోపాల్ గతంలో బుక్ మై షో, పేటీఎం లాంటి సంస్థలు చేసే తప్పుల్ని ఎత్తి చూపి తన కోర్టు ఖర్చులను రాబట్టుకున్న వ్యక్తి.

    Trending Stories

    Related Stories