International

పంజ్‌షీర్‌ ను తాలిబాన్లు సొంతం చేసుకున్నారా.. నిజమెంత..?

ఆఫ్ఘనిస్తాన్ లోని పంజ్‌షీర్‌ ప్రాంతం తాలిబాన్లను ఇన్ని రోజులూ ముచ్చెమటలు పట్టించింది. ప్రపంచం తమను పట్టించుకోవడం లేదని ఉగ్రవాదంపై పోరులో తమకు బయటికి నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదని పంజ్ షీర్ నేతలు అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మెజార్టీ ప్రజలు తాలిబన్ల పాలనను అంగీకరించడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు స్పందించి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ముఖ్యంగా తాలిబాన్లు పంజ్ షీర్ లోయలోకి వెళ్లకుండా రెసిస్టెన్స్ ఫోర్స్ పోరాడుతూ వస్తోంది. అయితే తాలిబాన్లు పంజ్ షీర్ ను సొంతం చేసుకున్నామని తాజాగా ప్రకటించారు. పంజ్‌షీర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని తాలిబాన్లు ప్రకటించారు. ఆప్ఘనిస్తాన్‌ అంతటినీ తమ ఆధీనంతోకి తెచ్చుకున్నట్లయ్యిందని తాలిబన్‌ కమాండర్‌ తెలిపారు. తిరుగుబాటుదారులు తమ చేతుల్లో ఓడిపోయారని.. ఆఫ్ఘనిస్తాన్ అంతటినీ స్వాధీనం చేసుకున్న నేపధ్యంతో తాలిబన్లు వేడుకలు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

జాతీయ ప్రతిఘటన దళం (ఎన్ఆర్ఎఫ్)కు భారీగా నష్టం చేకూర్చామని తాలిబాన్లు చెబుతుండగా.. లోయ ప్రవేశ మార్గాలన్నీ తమ ఆధీనంలోనే ఉన్నాయని, తాలిబాన్లు వందలాది మంది ఫైటర్లను కోల్పోయారని ఎన్ఆర్ఎఫ్ చెబుతోంది. ‘అల్లా దయతో ఆఫ్గన్ మొత్తం మా ఆధీనంలోకి వచ్చింది.. పంజ్‌షీర్‌లో తిరుగుబాటుదారులను ఓడించాం.. ప్రస్తుతం ఆ ప్రావిన్స్ మా కమాండ్‌లోనే ఉంది.’ అంటూ తాలిబాన్ కమాండర్ తెలిపారు.

తాలిబాన్ల ప్రకటనను ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ పూర్తిగా ఖండించారు. మేమిప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని.. తాలిబాన్లపై దండయాత్ర కొనసాగుతోందని అన్నారు. మేము ఈ నేలను పట్టుకుని పోరాడుతున్నామని అన్నారు. తాలిబాన్లపై తమ పోరాటాన్ని ఆపేది లేదని.. నేనిప్పుడు నా దేశం కోసం నిలబడుతున్నాను.. దేశ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని మీడియాకు ఆయన ఓ వీడియో సందేశం పంపించారు. పంజ్‌షీర్ నాయకుడు మసూద్..ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఇద్దరూ దేశం విడిచి పారిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయని ఇందులో ఏమాత్రం నిజం లేదని అమృల్లా సలేహ్ స్పష్టం చేశారు. తాము ఇప్పటికీ కూడా పంజ్‌షీర్ గడ్డ పైనే ఉన్నామని స్పష్టం చేశారు. పంజ్‌షీర్ ప్రస్తుతం మసూద్ నాయకత్వంలో తాలిబన్లతో పోరాడుతుందని తెలిపారు. తమ వెంట సుశిక్షితులైన 10వేల మంది పంజ్‌షీర్ యోధులు ఉన్నారని వీరంతా తాలిబన్లతో పోరాడుతున్నారని తెలిపారు.

ఆఫ్ఘనిస్తాన్ ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకే తాలిబాన్లు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అమృల్లా సలేహ్ తనయుడు ఎబదుల్లా సలేహ్ ఒక ప్రకటనలో తెలిపారు. తాలిబాన్లు పంజ్‌షీర్‌ను జయింలేదని స్పష్టం చేశారు. షంజ్ షీర్ ను జయించామని తాలిబాన్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జాతీయ తిరుగుబాటు దళం-విదేశీ వ్యవహారాల చీఫ్ అలీ నజరీ సైతం దీనిని ఖండించారు. పంజ్‌షీర్‌లోని 10వేల మంది యోధులు తీవ్రంగా పోరాటం చేస్తున్నారని.. ప్రజల దృష్టిని మరల్చేందుకే తాలిబన్లు ఇలాంటి ప్లాన్ లు రచిస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యల ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని తాలిబాన్లు భావిస్తున్నారని తెలిపారు. పంజ్‌షీర్‌లోని తిరుగుబాటు దళ నాయకులతో తాను టచ్‌లో ఉన్నానని.. తాలిబాన్లు చేస్తున్న ప్రకటనలో నిజం లేదని తేల్చిచెప్పారు.

ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న తాలిబాన్లు:

తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను రచిస్తూ ఉన్నారు. తాలిబన్ సహ వ్యవస్థాపకుడైన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటు ఉండనుంది . బరాదర్,దివంగత తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా మహమ్మద్ యాకూబ్,షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జయ్‌లు ప్రభుత్వంలో టాప్ 3 స్థానాల్లో ఉండనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇప్పటికే వీరు ఖతర్ నుంచి కాబూల్ చేరుకున్నట్లు తెలుస్తోంది. తాలిబాన్ ప్రభుత్వంతో మతపరమైన అంశాలను హైబతుల్లా అఖుద్‌జాదా పర్యవేక్షించనున్నట్లు సమాచారం. మొత్తం 25 మంత్రిత్వ శాఖలతో ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 4 =

Back to top button