More

    చైనా బడ్జెట్ ఫోన్స్ ను భారత్ లో నిషేధించబోతున్నారా..?

    ఆర్థికంగా చైనాను దెబ్బతీయాలని భారత్ ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పటికే పలు యాప్స్ పై ఆంక్షలు విధించి షాక్ ఇచ్చింది. చైనా ఆర్థిక మూలలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తూ ఉంది. తాజాగా చైనా ఫోన్లపై భారత్ నిషేధం విధించనున్నట్లు వార్తలు వచ్చాయి. దేశీయ సంస్థలను కాపాడుకునేందుకు, దేశీ తయారీని ప్రోత్సహించేందుకు రూ.12 వేల లోపు ధర ఉన్న చైనా ఫోన్లపై కేంద్ర సర్కారు నిషేధం విధించనుందంటూ కథనాలను కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. అయితే ఇది నిజం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మొబైల్ ఫోన్ల మార్కెట్లో చైనా కంపెనీలను నిషేధించే ఎటువంటి ప్రతిపాదన లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఈ బ్యాన్ కు సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వద్ద ఎటువంటి ప్రణాళిక పరిశీలనలో లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. గల్వాన్ లోయలో ఇరు దేశ సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ తర్వాత కేంద్ర సర్కారు చైనా కంపెనీలకు ఆంక్షలను విధిస్తూ వస్తోంది.

    spot_img

    Trending Stories

    Related Stories