More

    పాక్ ప్రధానికి ఇర్ఫాన్ పఠాన్ కౌంటర్

    టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు సెమీఫైనల్ లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే..! ఈ ఓటమిపై పాక్ ప్రధాని కూడా కౌంటర్లు వేశాడు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్ జట్టు పై ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పది వికెట్లతో విజయం సాధించడంపై ఆసక్తికర ట్వీట్ చేశారు. భారత్‌ పై ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా విజయం అందుకుంది. ఈ విజయాన్ని పాకిస్తాన్ పీఎం.. గతంలో టీమిండియాపై భారత్‌పై పాకిస్తాన్ విజయంతో పోల్చాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 12 స్టేజ్‌లో టీమిండియా పై పాకిస్తాన్ విజయం సాధించింది. అప్పుడు కూడా భారత్ పై పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా గెలిచింది. ఈ విషయాన్ని క్లుప్తంగా పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ట్వీట్ చేశాడు. ఈ ఆదివారం ఇలా 152/0 వర్సెస్ 170/0 అన్నమాట అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు.

    భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం దీనిపై స్పందించాడు. పాక్ ప్రధానికి తగిన రీతిలో బదులిచ్చాడు. ”భారత్ కు, పాకిస్థాన్ కు ఉన్న తేడా ఇదే. మేం మా సంతోషాన్ని మా విజయంలో వెతుక్కుంటాం. కానీ మీరు.. పొరుగు వారి బాధలు, కష్టాల్లో సంతోషాన్ని వెతుక్కుంటారు. అందుకే మీ దేశం పట్ల, మీ ప్రజల బాగోగుల పట్ల మీరు దృష్టి సారించలేకపోతున్నారు. ముందుగా మీరు మీ దేశాన్ని బాగు చేయడంపై శ్రద్ధ పెట్టండి” అంటూ పఠాన్ ట్విట్టర్ లో పోస్టు పెట్టాడు. మంచి కౌంటర్ ఇచ్చావంటూ పలువురు ఇర్ఫాన్ పఠాన్ కామెంట్ ను లైక్ చేస్తూ ఉన్నారు.

    Trending Stories

    Related Stories