ఇంగ్లండ్ కు ఐర్లాండ్ షాక్..!

0
772

టీ20 వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌ను ఐర్లాండ్‌ ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలుగడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 5 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌ జట్టు ఇంగ్లండ్‌కు 158 పరుగుల విజయలక్ష్యాన్ని విధించింది. ఇంగ్లండ్‌ 14.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. మొయిన్ అలీ 24 పరుగులతో, లియామ్ లివింగ్‌స్టోన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. దాంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఐర్లాండ్‌ 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 స్కోరుకు ఆలౌటైంది. కెప్టెన్ ఆండీ బల్బిర్నీ (47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 62) అర్ధ సెంచరీతో సత్తా చాటాడు. కీపర్ లోక్రాన్ టకర్ (34) కూడా రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్, లియమ్ లివింగ్ స్టోన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. సామ్ కరన్ రెండు వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 14.3 ఓవర్లలో 105/5 స్కోరుతో నిలిచిన సమయంలో వర్షంతో ఆట ఆగిపోయింది. కెప్టెన్ బట్లర్ (0), అలెక్స్ హేల్స్ (7), బెన్ స్టోక్స్ (6) విఫలమయ్యారు.. డేవిడ్ మలన్ (35), మొయిన్ అలీ (24 నాటౌట్) రాణించారు. 2011 వన్డే వరల్డ్‌ కప్‌లోనూ ఇంగ్లండ్‌ను ఐర్లాండ్‌ ఓడించి సంచనలం నమోదు చేయగా.. ఇప్పుడు మరోసారి ఇంగ్లండ్‌పై గెలిచి చూపించింది ఐర్లాండ్.