More

    శ్రీకృష్ణుడికి సేవ చేసుకోవాలని రిటైర్మెంట్ కోరిన ఐపీఎస్ అధికారిణి

    సీనియర్ ఐపీఎస్ అధికారిణి భారతి అరోరా వాలంటరీ రిటైర్మెంట్ ను కోరుకుంటూ ఉన్నారు. 1998 బ్యాచ్‌కు చెందిన భారతి అరోరా ప్రస్తుతం అంబాలా రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్నారు. అంబాలా రేంజ్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి) గా బాధ్యతలు స్వీకరించిన దాదాపు మూడు నెలల తరువాత భారతి అరోరా స్వచ్ఛంద పదవీ విరమణ కోరారు. 2001 బ్యాచ్ ఐపిఎస్ అధికారి వై పురాన్ కుమార్ స్థానంలో అరోరా ఏప్రిల్ 29 న కర్నాల్ నుండి అంబాలా రేంజ్ కు బదిలీ అయ్యారు. ఆమె మే 10 వరకు కర్నాల్ రేంజ్ ఐజిపిగా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. 2007 సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ పేలుడుపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు నాయకత్వం వహించారు. ప్రస్తుతం ఐజీ స్థాయి పోస్టులో కొనసాగుతున్న ఆమె స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు.

    భగవాన్‌ ‘శ్రీకృష్ణుడి సేవ’కు అంకితమయ్యేందుకు కోసం స్వచ్ఛందంగా పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీకి దరఖాస్తు పంపారు. ప్రస్తుతం నేను జీవితంలోని అంతిమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. గురునానక్‌ దేవ్‌, చైతన్య మహాప్రభు, కబీర్‌దాస్‌, తులసీద్‌, సుర్దాస్‌, మీరాబాయి, సూఫీ సాధువులు చూపిన మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాన్ని అంకితం చేయాలని అనుకుంటూ ఉన్నానని ఆమె లేఖలో పేర్కొన్నారు. తాను కొన్ని సంవత్సరాలుగా ఉన్న సేవామార్గాన్ని వదిలి.. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని ఆలోచిస్తున్నానని, భగవంతుని సాక్షాత్కారం కోసం పని చేస్తానని తెలిపారు. రాజకీయాల్లో చేరే ఉద్దేశం తనకు లేదని, ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ కోరినట్లు స్పష్టం చేశారు. జూలై 24 న ఆమె స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ లేఖ రాశారు. 50 సంవత్సరాల వయసులో అఖిల భారత సర్వీస్ (డిసిఆర్బి) నిబంధనలలోని సెక్షన్ 16 (2) ను ఉటంకిస్తూ జూలై 31 లోపు విధుల నుండి ఉపశమనం పొందాలని కోరారు. నిబంధనల ప్రకారం మూడు నెలల ముందస్తు నోటీసు వ్యవధిని మాఫీ చేయాలని అరోరా లేఖలో అభ్యర్థించారు. మిగిలిన జీవితాన్ని శ్రీకృష్ణుడి సేవలో గడపాలని అనుకున్నానని ఆమె లేఖలో వెల్లడించారు.

    23 సంవత్సరాల సర్వీసులో అరోరా అప్పట్లో పోలీసు సూపరింటెండెంట్ (GRP) గా 2007 సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ పేలుడుపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు నాయకత్వం వహించారు. ఫిబ్రవరి 18, 2007 న పానిపట్ సమీపంలో బాంబు దాడుల కారణంగా సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ లోని అరవై ఎనిమిది మంది మరణించారు. చనిపోయిన వారిలో ఎక్కువగా పాకిస్తాన్ పౌరులు ఉన్నారు.అంబాలా పోలీసు సూపరింటెండెంట్‌గా 2009 లో అప్పటి బిజెపి ఎమ్మెల్యే అనిల్ విజ్‌ను ఆమె అరెస్టు చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు అనిల్ విజ్ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు.

    Trending Stories

    Related Stories