హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ‘భజగోవిందం’ కీర్తనను వాడితే..!

0
748

చిన్న సినిమాలకు పబ్లిసిటీ కరువైనప్పుడు.. కాంట్రవర్సీ ద్వారా పబ్లిసిటీని తీసుకుని రావాలని అనుకుంటూ ఉంటారు. తాజాగా అలా ఓ సినిమా మీద వివాదం మొదలైంది. ఓ బూతు సినిమాలో బెడ్ రూమ్ సన్నివేశం కోసం ‘భజగోవిందం’ కీర్తనను వాడారు. దీంతో చిత్ర దర్శక నిర్మాతలపై కేసును నమోదు చేశారు.

ప్రస్తుతం ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ సినిమా విషయంలో జరిగిందే ఇది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చిత్ర యూనిట్ పై కేసు నమోదు చేశారు. సినిమా ట్రైలర్ లో ఓ సన్నివేశంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందని పేర్కొంటూ ఆన్ లైన్ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు 67 ఐటీ యాక్ట్, 295 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాటలు, సీన్లు, డైలాగులు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సోషల్ మీడియాలో సైతం వ్యతిరేకత వచ్చింది. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నారు. చిత్ర యూనిట్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు.

వేంకటేశ్వర స్వామివారి భజగోవిందం కీర్తనతో అసభ్యకర సన్నివేశాలు చిత్రీకరించారని దర్శకుడు, నిర్మాత, నటీనటులు సహా పలువురిపై వనస్థలిపురం పీఎస్ లో కూడా ఫిర్యాదు చేశారు.హిందువుల విశ్వాసాలను గాయపరిచిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని వీహెచ్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, బీజేపీ మల్కాజ్ గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ పోచంపల్లి గిరిధర్ డిమాండ్ చేశారు. పోలీసులకు వేర్వేరుగా లిఖిత పూర్వక ఫిర్యాదులు అందజేశారు. సన్నివేశాలను తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. మూవీ ట్రైలర్‌ కూడా అసభ్యకరంగా ఉందని కంప్లైంట్‌లో తెలిపారు.

దర్శకుడి క్షమాపణలు:

ఈ సినిమాకు యుగంధర్ దర్శకత్వం వహించాడు. ఆగస్ట్ 6న సినిమా విడుదల కానుంది. ఈ విమర్శలపై యుగంధర్ మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పుకొచ్చాడు. ఇది కావాలని చేసింది కాదని, తన పాత సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఈ ట్రైలర్ లో పెట్టుకోవటం వల్ల అది రాంగ్ ప్లేస్ లో భజగోవిందం అనే పార్టు ప్లే అయిందని వివరణ ఇచ్చాడు. అది నేను గమనించలేకపోయానని అది పొరపాటేనని తెలిపాడు. క్షమించమని అడుగుతున్నానని వీడియో విడుదల చేశాడు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here