More

    చెన్నై ను బోల్తా కొట్టించిన డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్

    ఐపీఎల్ 16వ సీజన్ కు ఘనంగా మొదలైంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ సీజన్ ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ ఓడించింది. చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 179 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.2 ఓవర్లలో ఛేదించింది.

    టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. గైక్వాడ్ కేవలం 50 బంతుల్లోనే 4 ఫోర్లు, 9 సిక్సులతో 92 పరుగులు సాధించాడు. చెన్నై 14 పరుగుల స్కోరు వద్ద ఓపెనర్ డెవాన్ కాన్వే (1) వికెట్ కోల్పోయింది. గైక్వాడ్ మాత్రం దూకుడుగా ఆడుతూ వచ్చాడు. మొయిన్ అలీ 23, రాయుడు 12, శివమ్ దూబే 19, ఆఖర్లో ధోనీ 14* (1 ఫోర్, 1 సిక్స్) పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ షమీ 2, రషీద్ ఖాన్ 2, అల్జారీ జోసెఫ్ 2, జోష్ లిటిల్ 1 వికెట్ తీశారు. చెన్నై ఆఖర్లో అనుకున్నదానికంటే 20 పరుగులు తక్కువే చేసింది. శివమ్ దూబే దూకుడుగా ఆడాల్సిన సమయంలో డాట్ బాల్స్ ఆడుతూ పరుగుల ప్రవాహం తగ్గేలా చేశాడు.

    179 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. సాయి సుదర్శన్ 22 పరుగులు చేయగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కేవలం 8 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో చెన్నైకు మ్యాచ్ లో నిలదొక్కుకునే అవకాశం దక్కింది. ఆల్ రౌండర్ విజయ్ శంకర్ 27 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. చివర్లో రాహుల్ తెవాటియా (15 నాటౌట్), రషీద్ ఖాన్ (10 నాటౌట్) గుజరాత్ కు విజయాన్ని అందించారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో రాజ్యవర్ధన్ హంగార్గేకర్ 3 వికెట్లు తీశాడు.

    Trending Stories

    Related Stories