More

  ఐపీఎల్ జట్లు రిటెన్షన్ చేసుకుంది వీరినే.. మెగా వేలంపాట మరింత ఆసక్తిగా..!

  ఐపీఎల్ జట్లు తాము రిటెన్షన్ చేసుకోబోయే ఆటగాళ్లను ప్రకటించాయి. గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటెన్షన్ చేసుకునే అవకాశం ఉండడంతో ఐపీఎల్ యాజమాన్యాలు చాలానే ఇబ్బంది పడ్డాయి. ఎలాగోలా కష్టపడి.. కోర్ టీమ్ ను అలాగే ఉంచుకుని ఐపీఎల్ ఫ్రాంచైజీలు జాబితాను బీసీసీఐకి సమర్పించాయి.

  ముంబై ఇండియన్స్ జట్టు రూ. 16 కోట్లతో రోహిత్‌ను రీటైన్ చేసుకుంది. 12 కోట్లతో బుమ్రాను, రూ. 8 కోట్లతో సూర్యకుమార్ యాదవ్‌ను, రూ. 6 కోట్లతో పొలార్డ్‌ను రీటైన్ చేసుకుంది. మయాంక్ అగర్వాల్‌ను రూ.12 కోట్లతో, అర్షదీప్‌ సింగ్‌ను 4 కోట్లతో పంజాబ్ కింగ్స్ జట్టు రీటైన్ చేసుకుంది. కేన్ విలియమ్సన్‌ను రూ. 14 కోట్లు, అబ్దుల్ సమద్‌ను రూ.4 కోట్లు, ఉమ్రాన్ మాలిక్‌ను రూ. 4 కోట్లతో సన్ రైజర్స్ జట్టు రీటైన్ చేసుకుంది. రవీంద్ర జడేజాను రూ.16 కోట్లతో, ఎంఎస్ ధోనీని రూ.12 కోట్లతో, మొయినీ అలీని రూ. 8 కోట్లతో, రుతురాజ్ గైక్వాడ్‌ను రూ.6 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రీటైన్ చేసుకుంది. రిషబ్‌ పంత్‌ను రూ.16 కోట్లతో, అక్షర్ పటేల్‌ను రూ.9 కోట్లతో, పృథ్వీ షాను ఏడున్నర కోట్ల రూపాయలతో ఢిల్లీ కేపిటల్స్ జట్టు రీటైన్ చేసుకుంది. రస్సెల్‌ను రూ.12 కోట్లతో వెంకటేశ్ అయ్యర్‌ను, రూ. 8 కోట్లతో వరుణ్ చక్రవర్తిని, సునీల్ నరైన్‌ను రూ. 6 కోట్లతో కోల్‌కతా జట్టు రీటైన్ చేసుకుంది. సంజు శాంసన్‌ను రూ.14 కోట్లతో, జోస్ బట్లర్‌ను రూ.10 కోట్లతో, యశస్వి జైశ్వాల్‌ను రూ.4 కోట్లతో రాజస్థాన్ జట్టు రీటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీని ఆర్‌సీబీ రీటైన్ చేసుకుంది. మ్యాక్స్‌వెల్‌‌ను, రూ. 11 కోట్లతో, సిరాజ్‌కు రూ.7 కోట్లతో ఆర్‌సీబీ రీటైన్ చేసుకుంది.

  రిటెన్షన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. రషీద్ ఖాన్ పేరు కనిపించలేదు. మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే, మహ్మద్ నబీని కూడా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ వదిలేసింది. నలుగురు ఆటగాళ్లని రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నా.. ముగ్గురినే హైదరాబాద్ ఎంచుకుంది.

  శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్, ఇషాన్ కిషన్, సురేష్ రైనా, ఫాఫ్ డుప్లెసిస్ వంటి క్రికెటర్లు మళ్లీ ఐపీఎల్ వేలం పాట లోకి వెళ్లనున్నారు. వీరిలో కొందరిని కొత్త ఫ్రాంచైజీలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు.

  Trending Stories

  Related Stories