హిందువుల్ని లేపేస్తాం..! ఇన్‎స్టా‎లో మతోన్మాది మెసేజ్..!!

0
829

పోగాలం దాపురించినవారి లక్షణాలు ఏమిటని పూర్వం ఓ గురువు శిష్యుని ప్రశ్నించాడుట. వినమ్రతగల ఆ శిష్యుడు.. అత్యంత వినయశీలతో.. గురుదేవునికి ఇలా సమాధానం ఇచ్చాడు. అకారణంగా కలహాలకు కాలు దువ్వి.. దారుణాలకు పాల్పడతానని, మంచివారిని వధిస్తానని, హత్యాకాండల్లో ఆరితేరి పోతాననే తిక్క తిక్క సమాధానాలు చెప్పేవాడికి.. పోగాలం వచ్చేసినట్టేనని శిష్యుడు చెప్పాడు. దీనికి, ఆ గురువు శభాష్ అని మెచ్చుకుని.. టోటల్ మార్కులు వేసేశాడుట. ఈ కథాసారాన్ని పరిశీలిస్తే.. రాజస్థాన్ ఇన్‎స్టాగ్రామ్ ప్రభావశీలుడు ఈ కోవకే చెందుతాడేమో అని పిస్తోంది.

హిందు బంధువులను వధిస్తానని వదరుబోతు మాటలు మాట్లాడిన నిందితుడు అర్షద్ ఖాన్.. చేసిన పాడుపనికి కారాగారం పాలయ్యాడు. ముస్తఫా అర్షద్ అలీ అకా అర్షద్ ఖాన్ అనే ఇస్లామిస్ట్, ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ రూపొందించి, హిందువులను హత్య చేస్తానని బెదిరింపుల పాల్పడ్డాడు. సమయం వచ్చినప్పుడు ఖననం చేయబడతారని.. హిందువులను ఉద్దేశించి ఖాన్ పిచ్చి పోస్ట్ పెట్టాడు. అక్టోబర్ 17న ఈ పోస్ట్ పెట్టి.. కొరివితో తలగోక్కున్నాడు. పోలీసులకు పని కల్పించి, ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. హిందువులను బెదిరింపులకు గురిచేస్తున్న ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు వెలుగులోకి రావడంతో.. కోటా పోలీసులు ఆలీ జాలీ లైఫ్‎కు బ్రేకులు వేశారు. తాను చేసిన పనితో తండ్రి నయీమ్ అలీకి తలవంపులు తెచ్చాడు.

కోల్‌కతాకు చెందిన ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసి దుండగుడి దాష్టీకాలు బహిరంగ పర్చడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ సమయం వచ్చినప్పుడు హిందువులను హతమారుస్తామని, ఈ విషయంలో ముస్లింలు స్పష్టంగా వున్నారని.. హిందువులారా, మీరేం చేస్తారు.. అని ట్వీట్‎లో బెదిరించాడు. దీంతో పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆలీని అరెస్ట్ చేసి.. జైల్లో రెస్ట్ కల్పించారు. ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 14 వేల మంది పోకిరి గ్యాంగ్ అనుచరులు కలిగిన అర్షద్ ఖాన్.. హిందువులను బెదిరించి.. కోరి కష్టాలకు స్వాగతం పలికాడు. ఇప్పుడు మౌనముద్ర వహించి.. జైలు గోడల మధ్య పడివున్నాడు.

బాంబే హైకోర్ట్ న్యాయవాది, మహారాష్ట్ర బిజెపి న్యాయ సలహాదారు అశుతోష్ జె దూబే సైతం ఈ వీడియోని షేర్ చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎరుపురంగు టీ షర్ట్ ధరించిన నిందితుడు ఖాన్.. మత విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తూ, హిందువులపై బహిరంగ బెదిరింపులకు పాల్పడ్డాడని దుబే తెలిపారు. హమారే ఖామోషి కి అలమత్, కాఫీరో తుమ్హారే లై బెహతర్ నహీ. వక్త్ అనే పర్ గఢ్ దేంగే తుమ్హే, జహా తుమ్ ఖడే హో వహ్హీ అని ఖాన్ ట్వీట్ చేశాడని ఆయన చెప్పారు. సమయం వచ్చినప్పుడు మీరంతా సమాధి చేయబడతారని హిందువులను ఉద్దేశించి, నిర్లజ్జగా, నిర్భయంగా ఇష్టానుసారం మాట్లాడిన వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బహిరంగంగా బెదిరిస్తున్న క్రిమినల్ విషయంలో రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తోందని అక్టోబర్ 19న ఆయన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. ప్రశ్నార్థకమైన వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించేలా ఆదేశాలివ్వాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, ఈ విషయాన్ని సీనియర్ పోలీస్ అధికారులకు తెలియజేశామని కోట పోలీసులు సమాధానం ఇచ్చారు.

ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అనేక ఇస్లామిక్ వీడియోలను పోస్ట్ చేశాడు. తన మునుపటి వీడియోల్లోని ఒక దాంట్లో.. బిజెపి లేదా కాంగ్రెస్ తదితర ఏ ఇతర రాజకీయ పార్టీని అనుసరించవద్దు. ఒక రోజు, మేము మా స్వంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఆలం-ఎ-ఇస్లాం అంటూ ఈ ముష్కర ఖాన్ ట్విట్టర్ పోస్ట్ చేశాడు. అప్నీ ఖుద్ కి సర్కార్ ఇన్షాహల్లాహ్ అమీన్ అని ఇస్లామిక్ పదాలతో క్యాప్షన్ చేసి, ఈ దిక్కుమాలిన పోస్ట్ పెట్టాడు. అక్టోబర్ 1న పోస్ట్ చేసిన అలాంటి మరో వీడియోలో, ఖాన్ ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ , హోం మంత్రి అమిత్ షాలను కించపరిచే పదజాలాన్ని ఉపయోగించాడు.

బెదిరింపులకు పాల్పడుతూ ట్వీట్ లు పెట్టిన క్రిమినల్ ఖాన్ ను అరెస్ట్ చేసినా, ప్రశ్నార్థకమైన వీడియో ఇంటర్నెట్ నుంచి ఇప్పటికీ తీసివేయకపోవడం పై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియోను కొందరు ఇస్లాం ముష్కరమూకలు చూస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

fourteen + eighteen =