More

    సీఐడీ షోను ఇన్స్పిరేషన్ గా తీసుకుని.. అత్యంత దారుణానికి పాల్పడ్డ మైనర్లు

    సినిమాలు, సీరియల్స్ ప్రభావం ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా యువత వాటిలోని చెడును చూసి ఎక్కువగా ఆకర్షితులు అయ్యే అవకాశం లేకపోలేదు. కొన్ని షోలలో చూపించే దారుణాలు, హత్యలు ఎంతో భయంకరంగా ఉంటాయి. ఇక హిందీలో(తెలుగులో కూడా డబ్ చేస్తుంటారు) వచ్చే సీఐడీ షో మర్డర్ మిస్టరీల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ షో ఇద్దరు మైనర్ల మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఏకంగా మర్డర్ చేసే స్థాయికి ఎదిగారు.

    పూణేకు చెందిన ఇద్దరు మైనర్లు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. 70 ఏళ్ల వృద్ధురాలిని అత్యంత పాశవికంగా హత్య చేయడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. షాలిని బద్నారావు సోనావానే అనే వృద్ధురాలు పూణేలోని సయాలి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుండేది. మైనర్లు షాలిని ఇంటికి సమీపంలోనే ఉండేవారు. వృద్ధురాలు ఒక్కతే ఒంటరిగా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుందని గ్రహించి.. ఆమె ఇంటిలో దొంగతనం చేయాలని భావించారు. అక్టోబర్‌ 30 మధ్యాహ్నం 01:30 గంటల ప్రాంతంలో నిందితులైన ఇద్దరు మైనర్లు షాలిని ఇంట్లో ప్రవేశించారు. ఆ సమయంలో ఆమె టీవీ చూస్తూ ఉంది. ఇంట్లో ప్రవేశించిన నిందితులు వృద్ధురాలిపై దాడి చేసి.. 93 వేల రూపాయల నగదు, కొంత బంగారం దొంగతనం చేశారు. నిందుతల దాడిలో వృద్ధురాలు మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

    నవంబర్ 2న 16, 14 సంవత్సరాల వయస్సు గల నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరం ప్రముఖ టీవీ షో CID నుండి ప్రేరణ పొందిందని పోలీసులు తెలిపారు. మృతి చెందిన మహిళ తలపై గాయం ఉండడాన్ని గుర్తించారు.

    Trending Stories

    Related Stories