అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధమైన ‘ఐనాక్స్’

0
797

క్రికెట్ అభిమానులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఐనాక్స్ మల్టీప్లెక్స్ సిద్ధమైంది. INOX Leisure Ltd తన మల్టీప్లెక్స్‌లలోని సినిమా స్క్రీన్‌లపై ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2022 మ్యాచ్‌లను లైవ్ టెలీకాస్ట్ చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో ఒప్పందంపై సంతకం చేసింది.

INOX Leisure Limited చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ విశాల్ మాట్లాడుతూ సినిమా థియేటర్స్ లో క్రికెట్‌ని ప్రదర్శించడం ద్వారా.. INOX దేశంలో క్రికెట్ ను ఇష్టపడే వారికి భారీ స్క్రీన్ లో మ్యాచ్ ను చూసే అనుభవాన్ని అందిస్తోందని అన్నారు. “ప్రపంచ కప్ అంటే ఉత్సాహం, భావోద్వేగాలు ఉంటాయి, బిగ్ స్క్రీన్ పై చూపించడం క్రికెట్ ప్రేమికులకు వర్చువల్ ట్రీట్ అవుతుంది. అభిమానుల కోసం క్రికెట్ వీక్షించే అనుభూతిని మళ్లీ అందించినందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, ” అని ఆనంద్ విశాల్ తెలిపారు.

అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచకప్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఈ నెల 23న జరిగే మ్యాచ్ తో భారత్ తన ప్రపంచకప్ టైటిల్ వేటను ఆరంభిస్తుంది. ఈ సూపర్ ఫైట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద మల్టీఫెక్స్ చైన్ ను ఈ ఏడాది మార్చిలో పీవీఆర్ సంస్థతో కలిసి ఏర్పాటు చేసింది ఐనాక్స్. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ యొక్క ఎనిమిదవ ఎడిషన్ అక్టోబర్ 16 నుండి ప్రారంభం కానుంది. సూపర్ 12 దశ అక్టోబర్ 22 న మొదలవుతుంది. ఫైనల్ నవంబర్ 13న మెల్బోర్న్‌లో జరుగనుంది.