More

    కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫ్రాక్చర్

    కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాయపడ్డారు. కుడికాలి మడమ వద్ద బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. గతంలో ఆయన కుడికాలు మడమకు దెబ్బ తగిలింది. ఇటీవల నొప్పి ఎక్కువవడంతో చికిత్స కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG హాస్పటల్ కు వెళ్లారు. అక్కడ ఎక్సరే తీయగా అందులో కుడికాలి మడమ వద్ద ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన కాలికి పట్టీకట్టారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే లెగ్ పెయిన్ తగ్గుతుందని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న కిషన్ రెడ్డికి ఫ్రాక్చర్ అవ్వడంతో బీజేపీ వర్గాలు కాస్త డీలా పడ్డాయి.

    Trending Stories

    Related Stories