More

    సోషల్ మీడియా స్టార్ ఇర్ఫాన్ ఆత్మహత్య నాటకం.. పోలీసులు ఏమి చేశారంటే

    సోషల్ మీడియాలో కొందరు ఉంటారు.. తాము సోషల్ మీడియాలో స్టార్స్ అని, ఇన్ఫ్లుయెన్సర్లమంటూ కొందరు వీడియోలను చేస్తూ ఉంటారు. ఎలాగైనా పాపులారిటీ తెచ్చుకోవాలన్నదే వీరి ప్రయత్నం. అలాంటి ఉద్దేశ్యంతో చేసే కొన్ని వీడియోలను చూస్తే చిరాకు, కోపం అన్నీ రావొచ్చు. అంతగా దిగజారిపోయి వీడియోలు చేసే వారు ఉన్నారు. వీడియోల కోసం చేసే కొన్ని పిచ్చి పిచ్చి పనులు ఇబ్బందులను కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి. హింసాత్మక ధోరణితో ప్రవర్తించడాలు, ఆత్మహత్యలకు ప్రేరేపించడాలు వంటివి ఈ సోషల్ మీడియా స్టార్స్ చేస్తూ ఉంటారు. అదేదో ‘శాడ్’ స్టేటస్ గా పెట్టుకుంటారు కొందరు అని ఇలాంటి వీడియోలను సృష్టిస్తూ ఉంటారు.

    అలా ఓ సోషల్ మీడియా స్టార్ చేసిన ఘనకార్యం అతడిని అరెస్టు చేసేలా చేసింది. ‘ఓ వ్యక్తి రైల్వే పట్టాల మీద మాట్లాడుతూ ఉంటాడు. అవతలి అమ్మాయి అతడి ప్రేమను ఒప్పుకోదు.. వెంటనే ఆ యువకుడు ఎదురుగా వచ్చే రైలు కింద పడిపోతాడు.. దీంతో రక్తపు మడుగులో ఉంటాడు.’ ఇలాంటి వీడియో పెట్టాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో రూపొందించి సోషల్‌ మీడియాలో విడుదల చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి పోలీసుల వరకు చేరడంతో అతడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది.

    28 సంవత్సరాల ఇర్ఫాన్‌ఖాన్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పీఖాన్‌ అనే యూజర్ నేమ్ పేరిట ఇన్‌స్టా, యూట్యూబ్‌ ఖాతాలు ఉన్నాయి. 44 వేల మందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. తాజాగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో రూపొందించాడు. ఖార్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో పట్టాలపై కూర్చున్నాడు. ఈ సమయంలో తనకు రైలు ఢీకొట్టినట్లు వచ్చేలా ఎడిట్‌ చేశాడు. ఈ వీడియోను చూసిన బాంద్రా పోలీసులు ఇర్ఫాన్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాను ఆత్మహత్య చేసుకోకూడదనే ఉద్దేశంతో అవగాహన కల్పించేందుకు ఆ వీడియో రూపొందించినట్లు పోలీసులకు ఇర్ఫాన్‌ చెప్పుకొచ్చాడు. క్షమాపణలు చెప్పి ఆ వీడియోను డిలీట్‌ చేసినప్పటికీ కటకటాల పాలయ్యాడు. ఈ వీడియో ట్విట్టర్‌లో కూడా వైరల్ అయింది.. 300,000 పైగా వ్యూస్ ను సాధించింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 336 కింద, ఇతరుల, తన ప్రాణాలకు అపాయం కలిగించే చర్యకు పాల్పడినందుకు ఖాన్ పై అభియోగాలు మోపబడ్డాయి, పుకారు లేదా భయంకరమైన వార్తలను ప్రచురించడం లేదా ప్రసారం చేసినందుకు సెక్షన్ 505 (1), భారత రైల్వే చట్టం ప్రకారం న్యూసెన్స్, ట్రెస్ పాసింగ్ కింద కేసులను నమోదు చేశారు.

    Trending Stories

    Related Stories