నేటి నుండి దక్షిణాఫ్రికాతో సమరం

0
803

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది టీమిండియా. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య బుధవారం(సెప్టెంబరు 28) నుంచి సిరీస్‌ ఆరంభం కానుంది. మూడు టీ20లు, మూడు వన్డేల కోసం భారత పర్యటనకు దక్షిణాఫ్రికా వచ్చింది. ఈ ఏడాది భారత్‌- సౌతాఫ్రికా మధ్య ఇది మూడో సిరీస్‌. జనవరిలో టీమిండియా దక్షిణాఫ్రికాకు వెళ్లగా.. జూన్‌లో ప్రొటిస్‌ జట్టు భారత్‌లో పర్యటించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రిషభ్‌ పంత్‌ సారథ్యంలోని భారత జట్టు 2-2తో సిరీస్‌(వర్షం కారణంగా మరో మ్యాచ్‌ రద్దు)ను సమం చేసింది. ఇక ఆసీస్ తో సిరీస్ జరిగిన టైమింగ్ లోనే సఫారీల టీ20 సిరీస్ జరగనుంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ఆరంభమవనుంది.

టీ20 సిరీస్‌
మొదటి టీ20: సెప్టెంబరు 28- బుధవారం- గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం- తిరువనంతపురం- కేరళ
రెండో టీ20: అక్టోబరు 2- ఆదివారం- బర్సపర క్రికెట్‌ స్టేడియం- గువాహటి- అసోం
మూడో టీ20: అక్టోబరు 4- మంగళవారం-హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియం- ఇండోర్‌- మధ్యప్రదేశ్‌

వన్డే సిరీస్‌
తొలి వన్డే: అక్టోబరు 6- గురువారం- భారత రత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్‌ స్టేడియం- లక్నో- ఉత్తరప్రదేశ్‌
రెండో వన్డే: అక్టోబరు 9- ఆదివారం- జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియం కాంప్లెక్స్‌- రాంచి- జార్ఖండ్‌
మూడో వన్డే: అక్టోబరు 11- మంగళవారం- అరుణ్‌ జైట్లీ స్టేడియం- ఢిల్లీ