More

    వందలాది మంది ఒకే ఎగ్జిట్ గేట్ వద్దకు వెళ్లడంతో.. 127 మంది మృతి

    ఇండోనేషియాలని తూర్పు జావా ప్రావిన్సులోని ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియా పోలీసు చీఫ్ మాట్లాడుతూ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ప్రేక్షకుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 127 మంది మరణించారు. ఇంకా 180 మంది గాయపడ్డారని తెలుస్తోంది. ఓడిపోయిన టీమ్ మద్దతుదారులు దాడి చేయడంతో.. అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ తర్వాత తొక్కిసలాటకు దారితీసిందని స్థానిక మీడియా తెలిపింది. అరేమా ఫుట్‌బాల్ క్లబ్-పెర్సెబయ సురబయ మధ్య గతరాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓడిపోయిన జట్టు అభిమానులు ఒక్కసారిగా మైదానంలోకి దూసుకురావడంతో.. వారిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. అభిమానులు మైదానంలోకి చొచ్చుకెళ్తున్న వీడియోలు, ఫొటోలను స్థానిక మీడియా చానళ్లు ప్రసారం చేశాయి. టియర్ గ్యాస్‌ నుండి బయటపడాలనే ప్రయత్నంలో వందలాది మంది ఒకే ఎగ్జిట్ గేట్ వద్దకు పరుగులు తీశారు. ఆ సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.

    ఈ మ్యాచ్‌లో పెర్సెబయ 3-2తో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన తొక్కిసలాటతో ఇండోనేషియాలోని ప్రముఖ లీగ్ అయిన బీఆర్ఐ లీగ్ 1.. వారం రోజులపాటు మ్యాచ్‌లను నిషేధించింది. ఈ తొక్కిసలాట ఘటనపై ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేషియా (పీఎస్ఎస్ఐ) విచారణకు ఆదేశించింది.

    Trending Stories

    Related Stories