More

    అమెరికాలో హిందూ యూనివర్సిటీకి భారీ విరాళం ఇచ్చిన ఇండో అమెరికన్ వ్యాపారవేత్త..!

    ప్రపంచ వ్యాప్తంగా హిందువుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. అలాగే ఇతర దేశాల ప్రజలు కూడా హిందూత్వాన్ని కొనియాడుతున్నారు, ఆచరిస్తున్నారు. హిందువుల సంప్రదాయాలను గౌరవిస్తున్నారు, పాటిస్తున్నారు. ఐతే అమెరికాలో హిందూ తత్వశాస్త్ర సిద్ధాంతాలను బోధిస్తున్న హిందూ యూనివర్సిటీకి ఆ దేశ వ్యాపారవేత్త భారీ విరాళం ఇచ్చారు. ఫ్లోరిడా రాష్ట్రంలో 1989లో ప్రారంభమైన హెచ్‌యూఏ 1993లో ఫ్లోరిడా ప్రభుత్వ గుర్తింపు పొందిన హిందూ యూనివర్శిటీ ఆఫ్ అమెరికాకు ఓ ఇండో అమెరికన్‌ వ్యాపారవేత్త 10 లక్షల డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.8.20 కోట్లు విరాళం ప్రకటించారు.

    భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త హ్యూస్టన్‌లోని స్టార్‌ పైప్‌ ప్రొడక్ట్స్‌ సీఈవో రమేశ్‌ భూటాడా రూ.8.20 కోట్లు అందజేశారు. భారీ విరాళాన్ని అందించిన రమేశ భూటాడాను వర్శిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కాగా..ఈ యూనివర్శిటీకి వచ్చిన విరాళాల్లో రమేశ్ భూటాడీ అందించిందే అతి పెద్ద విరాళం. రానురాను ఇటువంటి విద్యకు ఆదరణ తగ్గిపోతోందని.. ఇటువంటి అరుదైన విద్యను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ వర్శిటీ కృషి చేస్తోందని భూటాడా తెలిపారు. నేటి తరం యువత హిందూమతానికి సంబంధించిన విషయం పరిజ్ఞాన్ని అలవర్చుకోవాలని..తద్వారా చక్కటి జీవన విధానాన్ని అలవర్చుకోవాలని దాత రమేశ్ భూటాడా ఆశించారు. అందుకే ఈ విరాళాన్ని అందించానని తెలిపారు. ఇక హిందూ తత్వశాస్త్రం ఆధారంగా విద్యను అందించటమే లక్ష్యంగా ఉన్న ఏకైక విద్యా సంస్థ హిందూ యూనివర్శిటీ ఆఫ్ అమెరికా. అందుకే ఆయన భారీగా విరాళం ఇచ్చానని తెలిపారు.

    రమేశ్ భూటాడాను సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టానని.. అనేక హిందూ సంస్థల్లో సభ్యుడిగా ఉన్నానని అయినా హిందూ మతం సారాంశాన్ని తాను అర్థం చేసుకోలేకపోయానని చెప్పారు. కానీ నేటి యువత ఈ హిందూ తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకుని వారి జీవితాలను తీర్చి దిద్దుకోవాలని సూచించారు. హిందూ మతంలోని నిజమైన సారాంశాన్ని అర్థం చేసుకోవాటానికి తనకు 60 ఏళ్లు పట్టిందని తెలిపారు. మన కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులు, ప్రపంచంలో ఎలా సామరస్యంగా జీవించాలో హిందూమతం నేర్పుతుందని హిందూమతంలో తత్వశాస్త్రంలో ఉన్న గొప్పతనం అది అని యూనివర్శిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. భారతీయుడు, అందులోనూ హిందూ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి హిందుత్వం మీద అమితమైన గౌరవంతో ఇంత భారీ విరాళం అందించారని యూనివర్సిటీ ప్రకటనలో పేర్కొంది.

    Trending Stories

    Related Stories