షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది.
టెక్నికల్ లోపాన్ని ముందే గుర్తించారు పైలెట్. ఆకస్మాత్తుగా విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించి దించాల్సి వచ్చింది. ఈ మేరకు ఎయిర్‌లైన్స్ ప్రకటనలో విడుదల చేసింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేదని.. ఇండిగో తెలిపింది. ప్యాసింజర్స్ ను హైదరాబాద్ రప్పించేందుకు మరో విమానాన్ని పంపినట్టుగా తెలిపింది. భారత ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆకస్మికంగా కరాచీలో ల్యాండ్ అవడం.. 2 వారాల వ్యవధిలో ఇది రెండోసారి.
దిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానాన్ని కూడా జులై 5న హడావుడిగా పాక్‌లోని కరాచీకి మళ్లించారు. ఫ్యూయల్ ఇండికేటర్ సరిగా పనిచేయలేదని అప్పుడు ల్యాండ్ చేశారు. అప్పటి ఎస్జీ-11 విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పైస్‌జెట్ విమానంలోని ప్రయాణికులు కరాచీ నుంచి దుబాయి వెళ్లేందుకు వీలుగా మరో ఫ్లైట్‌ను భారత్ నుంచి పంపించాల్సి వచ్చింది. ఈ ఘటన గురించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తునకు ఆదేశించింది.